News September 22, 2024

సైబర్ నేరాలపై ఎస్పీ రోహిత్ రాజు సమీక్ష

image

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ప్రభుత్వ నిషేధిత గంజాయి రవాణాను అరికట్టడంలో బాధ్యతగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారుల తీరు ప్రశంసనీయమని చెప్పారు. శనివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన నెలవారి సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News March 5, 2026

‘పది’ పరీక్షలకు ఒత్తిడికి లోనవద్దు: ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంను గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులు భయం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. తరగతి గదులు, వంటగది, ఆహార నాణ్యతను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు.

News March 5, 2026

ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ‘L3’ చిక్కులు.. లబ్ధిదారుల ఆవేదన

image

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ లబ్ధిదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. గతంలో ‘L3’ (అనర్హులు) జాబితాలో ఉన్నవారిని కమిటీ సభ్యులు ‘L1’గా గుర్తించి ఇళ్లు మంజూరు చేయడంతో సమస్య మొదలైంది. అధికారుల హామీతో అప్పులు చేసి బేస్‌మెంట్ పూర్తి చేసిన వందకు పైగా లబ్ధిదారులకు, నిబంధనల సాకుతో బిల్లులు అందడం లేదు. అప్పుల భారంతో ఆందోళన చెందుతున్నామని, తనిఖీలు చేసి నిధులు విడుదల చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

News March 5, 2026

ఖమ్మం: మినరల్‌ వాటర్ పేరిట.. రోగాల విక్రయం!

image

జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న వాటర్ ప్లాంట్లు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. ఐఎస్‌ఐ మార్క్, ల్యాబ్ సౌకర్యం లేకుండానే బోరు నీటిని శుద్ధి చేసి విక్రయిస్తున్నారు. ఒక లీటర్ నీటి కోసం మరో లీటర్ వృధా చేస్తుండటంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. నాణ్యత లేని నీటితో రోగాల బారిన పడుతున్నామని, అధికారులు కల్తీ నీటి ప్లాంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.