News September 22, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: సెప్టెంబర్ 22, ఆదివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:05 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:09 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:30 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:12 గంటలకు
✒ ఇష: రాత్రి 7.24 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News September 22, 2024

అల్ప పీడనం.. భారీ వర్షాలు

image

తెలుగు రాష్ట్రాలను మళ్లీ భారీ వర్షాలు పలకరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడుతుందని, దీంతో APలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో 24, 25న భారీ వర్షాలు, 26న తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

News September 22, 2024

24వ తేదీ వరకు ఫ్రీ ఎగ్జిట్‌కు అవకాశం

image

AP: కన్వీనర్ కోటా కింద తొలి విడతలో MBBS సీటు పొందిన విద్యార్థులు ఎలాంటి నిబంధనలు లేకుండా సీటు వదులుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు NTR హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. గడువు దాటిన తర్వాత వచ్చిన అభ్యర్థనలు స్వీకరించబోమని పేర్కొంది. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3గంటల్లోగా సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్‌కు లేఖ అందించాలంది. ఇటు కళాశాలల్లో చేరిన విద్యార్థులు 24వ తేదీలోగా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది.

News September 22, 2024

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంలో రివ్యూ పిటిషన్: మాజీ ఎంపీ

image

AP: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిందని మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు. రిజర్వేషన్లను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. ఐకమత్యంగా ఉన్న జాతిని విడదీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీనిపై సుప్రీంకోర్టులో పోరాడుతామని చెప్పారు.