News September 22, 2024

లడ్డూ ప్రసాదంలో కల్తీ నిజమే: రఘురామ

image

AP: తిరుమల లడ్డూ ప్రసాదంలో నాణ్యత తగ్గిందని కొంతకాలంగా భక్తులు అంటున్న మాట వాస్తవమేనని MLA రఘురామకృష్ణరాజు అన్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నిజమేనన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కమీషన్ల కోసం కల్తీ నెయ్యికి జగన్ అనుమతించారని ఆరోపించారు. 2019 వరకు శ్రీవారి ప్రసాదం జోలికి పాలకులు వెళ్లలేదని అన్నారు. ఇకపై స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేసేలా CM చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

Similar News

News September 22, 2024

ముంపు నష్టం నమోదుకు నేడు, రేపు అవకాశం

image

AP: విజయవాడ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్ సృజన తెలిపారు. 2,740 మంది ఖాతాదారుల దరఖాస్తులు పరిష్కరించామన్నారు. రూ.148.22 కోట్ల రుణాలు రీషెడ్యూల్ చేశామని, కొత్తగా రూ.9.62 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. ముంపు నష్ట పరిహారం నమోదుకు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే నేడు, రేపు సచివాలయాలను సంప్రదించి ఎన్యూమరేషన్ చేయించుకోవాలని తెలిపారు. సోమవారం తుది జాబితా ప్రకటిస్తామన్నారు.

News September 22, 2024

అల్ప పీడనం.. భారీ వర్షాలు

image

తెలుగు రాష్ట్రాలను మళ్లీ భారీ వర్షాలు పలకరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడుతుందని, దీంతో APలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో 24, 25న భారీ వర్షాలు, 26న తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

News September 22, 2024

24వ తేదీ వరకు ఫ్రీ ఎగ్జిట్‌కు అవకాశం

image

AP: కన్వీనర్ కోటా కింద తొలి విడతలో MBBS సీటు పొందిన విద్యార్థులు ఎలాంటి నిబంధనలు లేకుండా సీటు వదులుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు NTR హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. గడువు దాటిన తర్వాత వచ్చిన అభ్యర్థనలు స్వీకరించబోమని పేర్కొంది. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3గంటల్లోగా సంబంధిత కాలేజీ ప్రిన్సిపల్‌కు లేఖ అందించాలంది. ఇటు కళాశాలల్లో చేరిన విద్యార్థులు 24వ తేదీలోగా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది.