News September 22, 2024

అన్న క్యాంటీన్లకు పసుపు రంగు వేయడాన్ని సవాల్ చేస్తూ పిల్

image

AP: అన్న క్యాంటీన్లు, ప్రభుత్వ భవనాలకు టీడీపీ రంగులు వేయడాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ భవనాలకు పసుపు రంగులు వేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని.. నోటిఫికేషన్ విడుదలైతే ఆ రంగులు తొలగించాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో ప్రజాధనం వృథా అవుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Similar News

News September 22, 2024

ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్, ర్యాష్ డ్రైవింగ్.. ఆర్టీసీపై విమర్శలు

image

ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తున్నారని, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పట్టించుకోవట్లేదని విమర్శలొస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని మెట్టుగూడ మెట్రో స్టేషన్ వద్ద రెడ్ సిగ్నల్ పడినప్పటికీ లోకల్ బస్ పట్టించుకోకుండా వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోతో ఓ నెటిజన్ పోలీసు, ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే మాదాపూర్‌లో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఓ యువతి మరణించిన విషయం తెలిసిందే.

News September 22, 2024

మహిళను 30 ముక్కలుగా నరికి..

image

కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ ఇంట్లో 29 ఏళ్ల మహిళను హత్య చేసి 30 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచారు. 4-5 రోజుల క్రితం ఈ మర్డర్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఝార్ఖండ్‌కు చెందిన మహాలక్ష్మి (29) భర్త హేమంత్‌తో విడిపోయి ఒంటరిగా ఉంటోందని పోలీసులు తెలిపారు. అయితే కొన్ని రోజులుగా ఆమెను పికప్, డ్రాప్ చేసేందుకు ఓ యువకుడు వచ్చే వాడని, అతడే ఈ హత్య చేసి ఉండొచ్చని ఏసీపీ తెలిపారు.

News September 22, 2024

స్మృతి ఇరానీకి ఢిల్లీ BJP పగ్గాలు?

image

వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో BJP వ్యూహాలకు పదునుపెడుతోంది. AAP కన్వీనర్ కేజ్రీవాల్ CM పదవి నుంచి తప్పుకొని ఆతిశీకి బాధ్యతలు అప్పగించగా BJP తమ ఫైర్ బ్రాండ్ స్మృతి ఇరానీని తెరపైకి తెచ్చే ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో సభ్యత్వ నమోదును ఆమె చూసుకుంటున్నారు. ఆమెనే CM అభ్యర్థనే ప్రచారం కూడా ఉంది. సౌత్ ఢిల్లీలో ఇల్లు కొనడం చూస్తే స్మృతి ఢిల్లీలో పాగా వేయడం ఖాయంగానే కనిపిస్తోంది.