News September 22, 2024
OTTల్లో పొగాకు హెచ్చరికలు తప్పనిసరి!
పొగాకు వల్ల కలిగే దుష్పరిణామాలపై హెచ్చరిక ప్రకటన OTTలకు తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈమేరకు సవరించిన ప్రతిపాదనలను కేంద్రం విడుదల చేసింది. సెన్సార్ సర్టిఫికెట్ స్టేటస్‌తో సంబంధం లేకుండా ప్రసారమయ్యే అన్ని సినిమాలకు ప్రారంభంలో, మధ్యలో కనీసం 30సెకన్ల పొగాకు వ్యతిరేక ప్రకటన ప్రసారం చేయాల్సి ఉంటుంది. సినిమాల్లోనూ పొగాకు ఉత్పత్తులను వాడే సన్నివేశాల సమయంలో హెచ్చరికలు ప్రదర్శించాల్సి ఉంటుంది.
Similar News
News December 30, 2024
సర్వ శిక్షా ఉద్యోగులు వెంటనే సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం
TG: కేజీబీవీల్లో పనిచేసే సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు వెంటనే సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సమ్మె విరమిస్తే వారి సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. 25 రోజులుగా సమ్మె చేయడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఆర్థికపరమైన డిమాండ్స్‌పై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామన్నారు.
News December 30, 2024
దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరంటే?
భారత్‌లో రిచెస్ట్ CMగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (₹931కోట్లు) నిలిచారు. ఆయన చరాస్తుల విలువ ₹810cr కాగా స్థిరాస్తుల విలువ ₹121crగా ఉంది. ఇక ఈ లిస్టులో అరుణాచల్ CM పెమా ఖండు (₹332cr) రెండో స్థానంలో, కర్ణాటక CM సిద్దరామయ్య (₹51cr) మూడో స్థానంలో ఉన్నారు. అత్యల్ప ఆస్తులున్న సీఎంగా ప.బెంగాల్ CM మమతా బెనర్జీ (₹15లక్షలు) నిలిచారు. J&K CM ఒమర్ ₹55లక్షలు, కేరళ CM విజయన్ ₹కోటి విలువ గల ఆస్తి కలిగి ఉన్నారు.
News December 30, 2024
మన్మోహన్ అస్థికల నిమజ్జనం.. విమర్శలపై స్పందించిన కాంగ్రెస్
మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యుల వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూ ఆయన అస్థికలను యమునా నదిలో కలిపే కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొనలేదని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. అంత్యక్రియల అనంతరం మన్మోహన్ కుటుంబాన్ని వారి నివాసంలో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ కలిసి పరామర్శించారని తెలిపింది. అస్థికలు నదిలో కలిపే విషయమై వారితో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ వెల్లడించింది.