News September 22, 2024

28న నల్సార్ యూనివర్సిటీకి రాష్ట్రపతి

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నెల 28న ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవం, సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో జరిగే భారతీయ కళా మహోత్సవంలో ఆమె పాల్గొంటారని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు. ఈ మేరకు సీఎస్ అధికారులతో సమావేశమై ఈరోజు సమీక్ష నిర్వహించారు. తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Similar News

News September 29, 2024

HYD: గాంధీలో పరిశోధనకు రచయిత్రి పార్థివదేహం

image

ప్రముఖ రచయిత్రి, తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ విజయభారతి HYD సనత్‌నగర్‌లో కన్నుమూశారు. 1941లో కోనసీమ జిల్లా రాజోలులో జన్మించిన ఈమె.. పద్మభూషణ్ బోయి భీమన్న కుమార్తె, దివంగత సామాజికవేత్త బొజ్జా తారకం సతీమణి. 20కి పైగా పుస్తకాలు రాసి,ఎన్నో పురస్కారాలు పొందారు.ఈమె కుమారుడు రాహుల్ బొజ్జా ప్రస్తుతం నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. భారతి పార్థీవదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి నేడు అందించనున్నారు.

News September 29, 2024

ఓయూ: 30న PDSU స్వర్ణోత్సవాల మహాసభ

image

PDSU స్వర్ణోత్సవాల మహా సభను ఈ నెల 30న ఓయూలో నిర్వహించనున్నారు. ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో స్వర్ణోత్సవాలను నిర్వహిస్తున్నట్లు PDSU రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, ఆజాద్ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వర్ణోత్సవ మహాసభలకు ముఖ్య వక్తలుగా ముంబై హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ జీబీ కోల్సేపాటిల్ హాజరవుతారని పేర్కొన్నారు.

News September 29, 2024

VIRAL: హైదరాబాద్‌లో సరస్సులు.. ఎంత బాగుండేనో..!

image

HYDRAA కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో 1879లో రూపొందించిన హైదరాబాద్ సరస్సుల చారిత్రక చిత్రాలు వైరల్ అయ్యాయి. పరిశోధకుడు అసిఫ్ అలీ ఖాన్ ఈ చిత్రాలను పంచుకుని నగరానికి చెందిన పూర్వ చరిత్రను వెలుగులోకి తెచ్చారు. హుస్సేన్ సాగర్, మిర్ ఆలమ్ ట్యాంక్, సరూర్ నగర్ సరస్సులపై ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కలుషితమైన ఈ సరస్సులను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.