News September 22, 2024
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నూతన మార్కెట్ కమిటీ ఛైర్మన్లు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదవుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు మార్కెట్ కమిటీలకు నూతన ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిజామాబాద్ మార్కెట్ కమిటీకి ముప్పిడి గంగారెడ్డి, కమ్మర్‌పల్లికి పాలేపునర్సయ్య, వేల్పూర్‌కు కోతినేటి ముత్యం రెడ్డి, బిక్కనూర్‌కు పాత రాజును ఛైర్మన్‌లుగా నియమించారు.
Similar News
News November 10, 2025
NZB: 3.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

జిల్లాలో ఇప్పటికే దాదాపు 50% మేర 3.47 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ పూర్తి చేయడంతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో సేకరించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు.
News November 10, 2025
అకోలా-కాచిగూడ రైలులో ఒకరి హత్య

అకోల నుంచి కాచిగూడ వెళ్లే రైలులో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి సోమవారం తెలిపారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. ఉమ్మడి గ్రామానికి చెందిన అతిశ రైలులో వాటర్ బాటిల్ అమ్ముకుంటూండగా, అదే గ్రామానికి చెందిన షేక్ జమీర్ వాటర్ బాటిల్ విషయంలో గొడవ పడ్డారు. దీంతో జమీర్ గాజు సీసాతో అతిశపై దాడి చేయగా మృతి చెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కరికెల్లి, ధర్మాబాద్ మధ్యలో జరిగింది.
News November 10, 2025
నిజామాబాద్: ప్రజావాణిలో 16 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నిజమాబాద్ సీపీ సాయి చైతన్య సోమవారం ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ మేరకు కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో 16 ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. సీపీ మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా తమ ఫిర్యాదులను అందించవచ్చని సూచించారు.


