News September 22, 2024

రన్నింగ్ బస్సులో మహిళపై లైంగిక దాడి

image

TG: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై బస్సు క్లీనర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. APలోని సామర్లకోటకు చెందిన మహిళ(28) HYD కూకట్‌పల్లిలో నివాసముంటోంది. స్వగ్రామానికి వెళ్లేందుకు ఈ నెల 18న బస్ బుక్ చేసుకుంది. బస్సు రన్నింగ్‌లో ఉండగా క్లీనర్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Similar News

News September 22, 2024

దేశంలో నోట్ల కొరత తీర్చండి: కాంగ్రెస్

image

దేశంలో ₹10, ₹20, ₹50 నోట్ల కొర‌త వ‌ల్ల గ్రామీణ భార‌తం ఇబ్బందులు ప‌డుతోంద‌ని, ఈ సమ‌స్య‌ను తీర్చాలంటూ కేంద్రానికి కాంగ్రెస్ లేఖ రాసింది. UPI, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి RBI ఈ నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు తెలుస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో MP మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. ఇది అర్థం చేసుకోద‌గిన‌దే అయినా వ‌స‌తులు లేని గ్రామీణ ప్ర‌జ‌లు ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొన్నారు.

News September 22, 2024

అత్యధికంగా అమ్ముడైన ఫోన్ మోడల్ ఇదే!

image

మన వద్ద కూడా అతని దగ్గరున్నటువంటి ఫోన్ ఉండాలి అనే స్థాయి నుంచి ఎవ్వరికీ ఉండని ఫోన్ కొనేందుకు రూ.లక్షలు వెచ్చించే స్థాయికి చేరుకున్నాం. మొబైల్ ఫోన్ వచ్చిన తొలినాళ్లలో ప్రతి ఇంట్లో ‘నోకియా 1100’ ఫోన్స్ ఉండేవి. ఇప్పటివరకూ అత్యధికంగా అమ్ముడైన ఫోన్ మోడల్ ఇదేనని మీకు తెలుసా? మొత్తం 250 మిలియన్ల ‘నోకియా 1100’ ఫోన్ల విక్రయాలు జరిగాయి. దీని తర్వాత ‘నోకియా 1110’ (248M), iPhone 6/6+ (222M) ఉన్నాయి.

News September 22, 2024

రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు.. మోదీకి జగన్ లేఖ

image

AP: తిరుమల లడ్డూ వివాదంపై ప్రధాని మోదీకి మాజీ సీఎం జగన్ లేఖ రాశారు. సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపించారు. ‘2014-19లో 14-15 సార్లు నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి. 2019-24లో 18 సార్లు రిజెక్ట్ చేశాం. 2 నెలల కింద ఒక ట్యాంకర్ రిజెక్ట్ అయింది. అలాంటప్పుడు లడ్డూల తయారీలో ఈ నెయ్యిని వాడేందుకు వీలులేదు. దీనిపై వాస్తవాలను నిగ్గు తేల్చండి’ అని కోరారు.