News September 22, 2024

4వ రోజు ఆట షురూ

image

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్టు 4వ రోజు ఆట మొదలైంది. 6 వికెట్లు చేతిలో ఉన్న బంగ్లా 357 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగింది. ప్రస్తుత స్కోర్ 187/4గా ఉంది. క్రీజులో శాంటో(61), షకీబ్ అల్ హసన్(21) ఉన్నారు. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 328 రన్స్ చేయాలి. భారత్ గెలవాలంటే బంగ్లాను ఆలౌట్ చేయాల్సి ఉంది. అటు ఇంకో రోజు ఆట మిగిలి ఉంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.

Similar News

News September 22, 2024

అత్యధికంగా అమ్ముడైన ఫోన్ మోడల్ ఇదే!

image

మన వద్ద కూడా అతని దగ్గరున్నటువంటి ఫోన్ ఉండాలి అనే స్థాయి నుంచి ఎవ్వరికీ ఉండని ఫోన్ కొనేందుకు రూ.లక్షలు వెచ్చించే స్థాయికి చేరుకున్నాం. మొబైల్ ఫోన్ వచ్చిన తొలినాళ్లలో ప్రతి ఇంట్లో ‘నోకియా 1100’ ఫోన్స్ ఉండేవి. ఇప్పటివరకూ అత్యధికంగా అమ్ముడైన ఫోన్ మోడల్ ఇదేనని మీకు తెలుసా? మొత్తం 250 మిలియన్ల ‘నోకియా 1100’ ఫోన్ల విక్రయాలు జరిగాయి. దీని తర్వాత ‘నోకియా 1110’ (248M), iPhone 6/6+ (222M) ఉన్నాయి.

News September 22, 2024

రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు.. మోదీకి జగన్ లేఖ

image

AP: తిరుమల లడ్డూ వివాదంపై ప్రధాని మోదీకి మాజీ సీఎం జగన్ లేఖ రాశారు. సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపించారు. ‘2014-19లో 14-15 సార్లు నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి. 2019-24లో 18 సార్లు రిజెక్ట్ చేశాం. 2 నెలల కింద ఒక ట్యాంకర్ రిజెక్ట్ అయింది. అలాంటప్పుడు లడ్డూల తయారీలో ఈ నెయ్యిని వాడేందుకు వీలులేదు. దీనిపై వాస్తవాలను నిగ్గు తేల్చండి’ అని కోరారు.

News September 22, 2024

ఈ హ్యాండిల్‌తోనే ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్స్

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ‘గేమ్ ఛేంజర్’ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు మేకర్స్ ట్విటర్‌లో ‘GameChangerOffl’ అనే అకౌంట్‌ను క్రియేట్ చేశారు. ఈ అకౌంట్‌లో త్వరలోనే అదిరిపోయే అప్డేట్‌ రాబోతోందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేశారు. కాగా, సెకండ్ సింగిల్ విడుదల అవుతుందని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.