News September 22, 2024
చైనాపై బైడెన్ కీలక వ్యాఖ్యలు.. మైక్‌లో రికార్డ్ అవ్వడంతో చర్చ

క్వాడ్ దేశాధినేతలతో చైనాను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన కీలక వ్యాఖ్యలు మైక్‌లో రికార్డ్ అవ్వడం చర్చకు దారి తీసింది. ‘చైనా దూకుడుగా ప్రవర్తిస్తూనే ఉంది. ఆర్థిక-సాంకేతిక సమస్యలతో సహా అనేక రంగాలలో మనందరినీ పరీక్షిస్తోంది’ అని బైడెన్ చేసిన వ్యాఖ్యలు హాట్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. దీంతో చైనా తీరుపై అమెరికా గుర్రుగా ఉందన్న విషయం మరోసారి స్పష్టమైందనే చర్చ నడుస్తోంది.
Similar News
News January 23, 2026
తులసిమతి మురుగేషన్‌కు మూడు బంగారు పతకాలు

కైరోలో జరిగిన ఈజిప్ట్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ పోటీల్లో భారత్‌కు చెందిన ప్లేయర్ తులసిమతి మూడు బంగారు పతకాలు తన ఖాతాలో వేసుకున్నారు. తమిళనాడుకు చెందిన తులసి ఏప్రిల్ 11, 2002లో జన్మించారు. తులసి ఎడమచేతికి పూర్తి వైకల్యం ఉన్నా దాన్ని అధిగమించి ఏడేళ్ల వయసులో బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించారు. ఇప్పటి వరకు అనేక పతకాలు గెలుచుకున్న ఆమె ఖాతాలో పారిస్ పారాలింపిక్స్ రజత పతకం కూడా ఉంది.
News January 23, 2026
కాలికి నల్ల దారం కట్టుకుంటున్నారా?

దిష్టి తగలకూడదని కాళ్లకు నల్ల దారం కట్టుకుంటారు. అయితే మంగళవారం లేదా శనివారం రోజున దాన్ని ధరించడం శుభకరమంటున్నారు పండితులు. పురుషులు కుడి కాలికి, స్త్రీలు ఎడమ కాలికి దీనిని కట్టుకోవాలని సూచిస్తున్నారు. ‘దారానికి తొమ్మిది ముడులు వేయడం ముఖ్యం. నలుపు రంగు ఉన్న చోట వేరే ఇతర రంగు దారాలు ఉండకూడదు. ఈ పద్ధతులు పాటించడం వల్ల ఆశించిన ఫలితం లభిస్తుంది’ అని చెబుతున్నారు.
News January 23, 2026
జైలు నుంచి జోగి రమేశ్, రాము విడుదల

AP: నకిలీ మద్యం కేసులో అరెస్టయిన YCP నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు రాము జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో 85రోజులుగా విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారికి తంబళ్లపల్లి కోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. ‘జైలులో మమ్మల్ని ఇబ్బందిపెట్టారు. అక్రమ కేసులకు మేం భయపడం. రెడ్ బుక్ మడిచి జేబులో పెట్టుకోండి. జగన్‌ను మళ్లీ CM చేసేదాకా కొదమసింహాల్లా పనిచేస్తాం’ అని విడుదల అనంతరం జోగి రమేశ్ వ్యాఖ్యానించారు.


