News September 22, 2024

iPhone 16 ధరలు.. ఇండియాVsఅమెరికా

image

ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు ఇండియా మార్కెట్లోనూ అందుబాటులోకి వచ్చాయి. ఎప్పటిలాగే అమెరికాలో ఐఫోన్ ప్రారంభ ధరలు తెలుసుకునేందుకు చాలామంది వెతుకుతున్నారు. iPhone 16(ఇండియాలో రూ.79,900 – USలో రూ.66,700). iPhone 16 Plus (ఇండియాలో రూ.89,900 – USలో రూ.75,049). iPhone 16 Pro (ఇండియాలో రూ.1,34,900 – USలో రూ.83,397), iPhone 16 Pro Max (ఇండియాలో రూ.1,59,900 – USలో రూ.1,00,093).

Similar News

News November 4, 2025

ప్రతి 40 రోజులకో యుద్ధ నౌక: నేవీ చీఫ్

image

ప్రతి 40 రోజులకు ఒక స్వదేశీ యుద్ధనౌక లేదా జలాంతర్గామిని ఇండియన్ నేవీలోకి చేరుస్తున్నామని చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి వెల్లడించారు. 2035 నాటికి 200కు పైగా వార్ షిప్‌లు, సబ్‌మెరైన్లు కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం 52 నౌకలు భారత షిప్‌యార్డుల్లోనే నిర్మితమవుతున్నాయని తెలిపారు. కాగా ప్రస్తుతం మన వద్ద 145 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి.

News November 4, 2025

160 సీట్లకు పైనే గెలుస్తాం: అమిత్ షా

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. 160కి పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, జేడీయూ సమాన సీట్లు సాధిస్తాయని అన్నారు. గత 11 ఏళ్లలో రోడ్లు, బ్రిడ్జిలు, పవర్ ప్లాంట్లు వంటి అతి ముఖ్యమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేశామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

News November 4, 2025

AP న్యూస్ అప్‌డేట్స్

image

✦ రైతులకు YCP ఏం చేసిందో అసెంబ్లీలో చర్చిద్దామా? జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్
✦ నకిలీ మద్యం కేసులో ఏడుగురిని కస్టడీకి ఇచ్చిన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు.. ఈ నెల 7 నుంచి 11 వరకు నిందితులను ప్రశ్నించనున్న పోలీసులు
✦ మద్యం కేసు నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ బెయిల్ పిటిషన్లపై విచారణ ఈ నెల 7కు వాయిదా వేసిన విజయవాడ ACB కోర్టు.. కౌంటర్ వేయాలని సిట్‌కు ఆదేశం