News September 22, 2024

చర్చిలో అపవిత్రం జరిగితే జగన్ ఊరుకుంటారా?: పవన్

image

తిరుమలలో జరిగినట్లు చర్చి/మసీదులో ఏదైనా అపవిత్రత చోటుచేసుకుంటే దేశమంతా అల్లకల్లోలం చేసేవారని, ప్రపంచమంతా తెలిసేదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ‘మేము అన్ని మతాలను గౌరవిస్తాం. కానీ ఈ వివాదంపై మాట్లాడొద్దంటే ఎలా? దీని వల్ల కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇదే చర్చి/మసీదులో జరిగితే మాజీ సీఎం జగన్ ఊరుకుంటారా? దోషులను ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ‘ అని ఫైరయ్యారు.

Similar News

News September 22, 2024

ఇండియా-బీపై ఇండియా-డీ ఘన విజయం

image

దులీప్ ట్రోఫీలో ఇండియా-బీతో జరిగిన మ్యాచులో ఇండియా-డీ 257 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో శాంసన్ సెంచరీ చేయడంతో ఇండియా-డీ 349 పరుగులు చేసింది. మరోవైపు ఇండియా-బీ 282 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్సులో IND-D 305 రన్స్ చేయగా 372 పరుగుల ఆధిక్యం సాధించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇండియా-బీ 115 పరుగులకే ఆలౌటైంది. ఇండియా-డీ బౌలర్ అర్షదీప్ సింగ్ 9 వికెట్లు తీశారు.

News September 22, 2024

పవన్ కళ్యాణ్‌తో టీటీడీ ఈవో భేటీ

image

AP: మంగళగిరి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశంపై పవన్ ఆరా తీయగా, గత పాలకమండలి హయాంలో ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఈవో వివరించారు. టీటీడీ తరఫున సంప్రోక్షణ చర్యల గురించి చర్చించారు.

News September 22, 2024

శ్రీలంక అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఎవ‌రికీ ద‌క్క‌ని మెజారిటీ

image

శ్రీలంక అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఏ అభ్య‌ర్థీ గెల‌వ‌డానికి అవ‌స‌ర‌మైన 50% ఓట్ల‌ను ద‌క్కించుకోలేక‌పోయారు. దీంతో రెండో రౌండ్ కౌంటింగ్‌కు (ప్రాధాన్య‌త ఓట్ల లెక్కింపు) ఎన్నికల సంఘం ఆదేశించింది. మార్క్సిస్ట్ నాయకుడు అనుర కుమార, విప‌క్ష నేత‌ స‌జిత్ ప్రేమ‌దాస మొద‌టి రెండు స్థానాల్లో నిలిచారు. ఇప్పుడు వీరిద్ద‌రి మధ్య రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది. ప్రాధాన్య‌త ఓట్ల ఆధారంగా విజేత‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.