News September 22, 2024

తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

image

AP: తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబును టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన ఈవో జె.శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సీఎంకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఇచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు సీఎం చంద్రబాబుకు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందించారు.

Similar News

News January 26, 2026

20 నిమిషాలకో ఇండియన్ అరెస్ట్

image

భవిష్యత్తు ఆశతో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ భారతీయులు అధికంగా పట్టుబడుతున్నారు. ఆ దేశ సరిహద్దుల్లో 2025లో ప్రతి 20 నిమిషాలకో ఇండియన్ అరెస్టయ్యారు. గత ఏడాది 23,830 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నట్లు US కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ వెల్లడించింది. 2024లో ఈ సంఖ్య 85,119గా ఉంది. గతేడాది వివిధ దేశాలకు చెందిన 3.91L మంది అరెస్టయ్యారు. కెనడా, మెక్సికో సరిహద్దుల్లో ఎక్కువ మంది పట్టుబడుతున్నారు.

News January 26, 2026

గంటల వ్యవధిలో స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం <<18961013>>ధర<<>> ఉదయంతో పోల్చితే కాస్త తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఉదయం రూ.1,62,710 ఉండగా రూ.760 తగ్గి రూ.1,61,950కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఉదయం నుంచి రూ.700 పతనమై రూ.1,48,450 పలుకుతోంది. అటు KG సిల్వర్ రేటు రూ.3,75,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News January 26, 2026

‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్లు ఎంతంటే?

image

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ నిన్నటి వరకు రూ.350 కోట్ల(గ్రాస్)కు పైగా వసూలు చేసింది. నిన్న జరిగిన ఈవెంట్‌లో మేకర్స్ స్పెషల్ పోస్టర్ వేశారు. ఈ సినిమా ఇప్పటికే అత్యధిక వసూళ్లు రాబట్టిన ప్రాంతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా విక్టరీ వెంకటేశ్ స్పెషల్ రోల్ చేశారు.