News September 22, 2024

దేశంలో నోట్ల కొరత తీర్చండి: కాంగ్రెస్

image

దేశంలో ₹10, ₹20, ₹50 నోట్ల కొర‌త వ‌ల్ల గ్రామీణ భార‌తం ఇబ్బందులు ప‌డుతోంద‌ని, ఈ సమ‌స్య‌ను తీర్చాలంటూ కేంద్రానికి కాంగ్రెస్ లేఖ రాసింది. UPI, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి RBI ఈ నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు తెలుస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో MP మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. ఇది అర్థం చేసుకోద‌గిన‌దే అయినా వ‌స‌తులు లేని గ్రామీణ ప్ర‌జ‌లు ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొన్నారు.

Similar News

News September 22, 2024

‘టీ’లో బిస్కెట్లు ముంచుకుని తింటున్నారా?

image

‘టీ’లో బిస్కెట్లు ముంచుకుని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చాయ్‌లో బిస్కెట్లు తింటే అధిక షుగర్ కంటెంట్ శరీరానికి చేరుతుంది. బిస్కెట్లను షుగర్, మైదాపిండితో తయారు చేయడంతో చక్కెర స్థాయులు పెరుగుతాయి. శరీరంలో వాపు, హార్మోన్ల అసమతుల్యత, ఇన్సులిన్ నిరోధకత, బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. గుండె సంబంధిత సమస్యలూ వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. హెర్బల్ టీ తాగడం ఉత్తమం.

News September 22, 2024

చిరంజీవికి సీఎం అభినందనలు

image

మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కడం గర్వించదగ్గ విషయమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేశారు. మరో వైపు చిరంజీవికి కంగ్రాట్స్ చెబుతూ మెగా అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ఏ రికార్డు అయినా మెగాస్టార్‌కు దాసోహం అనాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు.

News September 22, 2024

సచిన్‌ను అధిగమించిన రోహిత్ శర్మ

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించారు. అత్యధిక విజయాల్లో పాలు పంచుకున్న నాలుగో క్రికెటర్‌గా నిలిచారు. ఇప్పటివరకు ఆయన 484 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 308 గెలుపుల్లో భాగమయ్యారు. ఈ క్రమంలో ఆయన సచిన్ టెండూల్కర్(307 విజయాలు)ను అధిగమించారు. అగ్ర స్థానంలో రికీ పాంటింగ్(377 విజయాలు)ఉన్నారు. ఆ తర్వాత మహేల జయవర్ధనే(336), విరాట్ కోహ్లీ(322) నిలిచారు.