News September 22, 2024

ఇండియా-బీపై ఇండియా-డీ ఘన విజయం

image

దులీప్ ట్రోఫీలో ఇండియా-బీతో జరిగిన మ్యాచులో ఇండియా-డీ 257 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో శాంసన్ సెంచరీ చేయడంతో ఇండియా-డీ 349 పరుగులు చేసింది. మరోవైపు ఇండియా-బీ 282 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్సులో IND-D 305 రన్స్ చేయగా 372 పరుగుల ఆధిక్యం సాధించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇండియా-బీ 115 పరుగులకే ఆలౌటైంది. ఇండియా-డీ బౌలర్ అర్షదీప్ సింగ్ 9 వికెట్లు తీశారు.

Similar News

News September 22, 2024

ఈ పురస్కారం తెలుగువారికి మరింత గర్వకారణం : CBN

image

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. తన గ్రేస్, నటనతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని కృషి చేశారని ట్వీట్ చేశారు. ఇది చిరంజీవికి గుర్తింపును పెంచడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి మరింత గర్వకారణమని పేర్కొన్నారు.

News September 22, 2024

హర్భజన్ నాకు స్ఫూర్తి: అశ్విన్

image

బౌలింగ్‌లో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనకు స్ఫూర్తి అని టీమ్ ఇండియా స్పిన్నర్ అశ్విన్ తెలిపారు. బంగ్లాతో తొలి టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ‘హర్భజన్‌తో నన్ను నేను పోల్చుకోలేను. ఆయనో దిగ్గజం. జూనియర్ క్రికెట్‌లో భజ్జీ బౌలింగ్ యాక్షన్‌ను ట్రై చేస్తుండేవాడిని. నేను ఇప్పుడున్న స్థాయికి చేరుకోవడంలో ఎంతోమంది సాయం చేశారు’ అని గుర్తుచేసుకున్నారు.

News September 22, 2024

గ్రూప్-1 మెయిన్స్‌పై నీలి నీడలు?

image

TG: OCTలో గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ పరీక్షలపై హైకోర్టులో దాదాపు 20కి పైగా కేసులు ఉండటంతో నియామక ప్రక్రియపై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఫైనల్ ‘కీ’లో తప్పులు, ST, EWS రిజర్వేషన్, go 29 vs 55 సహా పలు అంశాలపై కేసులు దాఖలవడమే వీరి ఆందోళనకు కారణం. ఈ అంశాలు కొలిక్కి వచ్చాకే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం, TGPSCలను అభ్యర్థులు కోరుతున్నారు.