News September 22, 2024

అశ్విన్ ‘ది ఆల్ రౌండర్’

image

భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ టెస్టు క్రికెట్లో రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా బంగ్లాదేశ్‌తో ముగిసిన తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ(113)తో అదరగొట్టి, సెకండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీశారు. ఒకే మ్యాచ్‌లో సెంచరీ, 5వికెట్లు తీయడం అశ్విన్‌కిది 4వసారి. ఇయాన్ బోథమ్(5) టాప్‌లో ఉన్నారు. ఒకే వేదికపై(చెన్నై) ఈ ఫీట్ 2సార్లు(2021, 2024) నమోదు చేసిన ఆటగాడు మాత్రం అశ్విన్ ఒక్కరే.

Similar News

News January 14, 2026

సర్పవరం: జర్నలిస్టుపై వైసీపీ నేత దాడి చేశాడని నిరసన

image

పాత్రికేయుడు సూర్యప్రకాశ్ పై ఓ YCP నేత దాడి చేశాడని ఆరోపిస్తూ జర్నలిస్టులు మంగళవారం సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి, బాధ్యుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు వినతిపత్రం అందజేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

News January 14, 2026

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వాయిదా

image

ఇవాళ విడుదల కావాల్సిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2026 నోటిఫికేషన్‌ను <>UPSC<<>> వాయిదా వేసింది. అడ్మినిస్ట్రేషన్ కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏటా సివిల్ సర్వీసు ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://upsc.gov.in

News January 14, 2026

వచ్చే నెల 17 నుంచి టెన్త్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్

image

AP: టెన్త్ విద్యార్థులకు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రీఫైనల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వీటి అనంతరం గ్రాండ్ టెస్ట్, పబ్లిక్ పరీక్షలు ఉండనున్నాయి. మరోవైపు సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10 నుంచి 18 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.