News September 22, 2024
హైదరాబాద్‌కు వర్ష సూచన⛈️

East HYDకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, బండ్లగూడ, ఎల్బీనగర్, సరూర్‌నగర్, సైదాబాద్, దిల్‌సుఖ్‌నగర్, రామంతాపూర్, అంబర్‌పేట, మీర్‌పేట, గుర్రంగూడ, వనస్థలిపురంలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అప్రమత్తంగా ఉండాలని HYDRAA ట్వీట్ చేసింది. అత్యవసర సహాయం కోసం 040-21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని సూచించింది.
Similar News
News November 5, 2025
కూతురితో కలిసి హుస్సేన్‌సాగర్‌లో దూకి సూసైడ్

హుస్సేన్‌సాగర్‌లో దూకి తల్లీబిడ్డ తనువు చలించారు. లేక్ పోలీసుల వివరాలు.. CA కీర్తిక అగర్వాల్(28), ఆమె పాప కనిపించడం లేదని బహదూర్‌పురా PSలో మిస్సింగ్ కేసు నమోదైంది. NOV 2న హుస్సేన్‌సాగర్‌లో ఓ యువతి మృతదేహం లభ్యం అవగా విచారించిన పోలీసులు చనిపోయింది కీర్తిక అని గుర్తించారు. భర్తతో విభేదాల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు నిర్ధారించారు. పాప మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు చేపట్టారు.
News November 5, 2025
HYD: 19 మంది చనిపోయినా గుంత పూడ్చలే?

చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన గుంతను పూడ్చే విషయంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. యాక్సిడెంట్ నేపథ్యంలో ఈ గుంతను మంగళవారం ఉదయం డస్ట్‌తో పూడ్చారు. సాయంత్రం డస్ట్ అంతా కొట్టుకుపోయి మళ్లీ గుంత యథాస్థితికి వచ్చింది. రాత్రి సమయంలో ఈ గుంత ప్రమాదకరంగా కనిపించింది. ఇంత ఘోరం జరిగినా అధికార యంత్రాంగంలో చలనం లేకపోవడం గమనార్హం.
News November 5, 2025
HYD: డ్రంక్ & డ్రైవ్‌లో దొరికి PS ముందే సూసైడ్

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ సూసైడ్ కలకలం రేపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఒక వ్యక్తి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు దమ్మాయిగూడకు చెందిన మీన్ రెడ్డిగా గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


