News September 22, 2024

AICC యూత్ అధ్యక్షుడిగా ఉదయ్ భాను

image

అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉదయ్ భాను ఛిబ్‌ను నియమిస్తూ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయ్ భాను గతంలో జమ్మూ కశ్మీర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాగా జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఈ నియామకం జరగడం గమనార్హం.

Similar News

News September 22, 2024

అనుర కుమార దిసనాయకే ఎవరంటే?

image

శ్రీలంక దేశాధ్యక్ష పీఠంపై కూర్చోనున్న <<14168908>>దిసనాయకే <<>>(55) వామ‌ప‌క్ష పార్టీ అయిన‌ జనతా విముక్తి పెరమున(JVP)కు నాయ‌కత్వం వ‌హిస్తున్న‌ారు. ప్ర‌స్తుతం కొలంబో జిల్లా నుంచి పార్ల‌మెంటుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో నేష‌న‌ల్ పీపుల్స్ ప‌వ‌ర్‌ కూట‌మికి ఆయన సారథ్యం వ‌హిస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం 3వ స్థానానికే పరిమితమైన ఆయన ఈ సారి అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో సత్తా చాటి భారీ తేడాతో గెలిచారు.

News September 22, 2024

లడ్డూను అపవిత్రం చేసిన వారిపై చర్యలు: టీటీడీ ఈఓ

image

AP: తిరుమల లడ్డూ అపవిత్రతపై సిట్ ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని TTD ఈఓ శ్యామలరావు తెలిపారు. ‘ప్రస్తుతం నందిని, ఆల్ఫా సంస్థల నుంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కిలో రూ.475కు కొంటున్నాం. దోషాలను తొలగించడానికి ఇప్పటికే పాప ప్రోక్షణ హోమాలు నిర్వహించాం. అనుభవజ్ఞులైన 18 మందితో సెన్సరీ ప్యానల్ ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే తిరుమలలో FSSL ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

News September 22, 2024

ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకూ పాక్‌తో చర్చలుండవు: అమిత్ షా

image

పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేవరకూ ఆ దేశంతో చర్చలు జరిపేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. ‘కశ్మీర్‌లో త్రివర్ణ పతాకం మాత్రమే ఎగురుతుంది. పాక్‌తో మాట్లాడాలని ప్రతిపక్షాలంటున్నాయి. ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోయేవరకు అది జరగని పని. బీజేపీ మీకు హామీ ఇస్తోంది. ఒక్క ఉగ్రవాదిని కూడా విడిచిపెట్టం’ అని స్పష్టం చేశారు.