News September 22, 2024
జలపాతంలో కొట్టుకుపోయిన మెడికల్ విద్యార్థులు

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలోని జలతరంగిణి జలపాతంలో ముగ్గురు మెడికల్ విద్యార్థులు గల్లంతయ్యారు. తొలుత ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోగా, స్థానికులు ఇద్దరిని కాపాడారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నారు. ఏలూరులోని ఓ మెడికల్ కాలేజీ నుంచి 14 మందికిపైగా వైద్య విద్యార్థులు ఇవాళ టూర్‌కు వచ్చారు.
Similar News
News January 15, 2026
OTD: టీమ్ ఇండియా ఘన విజయం

సరిగ్గా ఇదే తేదిన మూడేళ్ల క్రితం శ్రీలంకపై టీమ్ ఇండియా అద్భుతమైన విజయం నమోదు చేసింది. గిల్(116), కోహ్లీ(166*) సెంచరీల విధ్వంసం చేయగా భారత్ 50 ఓవర్లలో 390/5 స్కోరు చేసింది. ఛేదనలో సిరాజ్ 4, షమీ, కుల్దీప్ చెరో 2 వికెట్లతో చెలరేగడంతో SL 73 పరుగులకే కుప్పకూలింది. దీంతో 317 పరుగుల తేడాతో ఘనవిజయం సొంతమైంది. పరుగులు పరంగా ODIల్లో భారత్‌కు ఇదే భారీ విజయం. ఈ మ్యాచులో కోహ్లీ POTMగా నిలిచారు.
News January 15, 2026
వెంటనే USతో ట్రేడ్ డీల్ చేసుకోవాలి: థరూర్

ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై ట్రంప్ 25% సుంకాలు విధిస్తాననడంపై కాంగ్రెస్ MP శశిథరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు 50% సుంకాలు ఉన్నాయని గుర్తుచేశారు. భారీ సుంకాలు చెల్లించి USకు ఎగుమతులు చేయడం ఏ భారతీయ కంపెనీకీ సాధ్యం కాదని.. మన వస్తువుల ధరలు పెరిగి పోటీలో వెనుకబడతామని థరూర్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే USతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు.
News January 15, 2026
ఎన్నికల్లో ఇంకుకు బదులు మార్కర్ పెన్నులు: రాజ్ ఠాక్రే

మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో ఇంకుకు బదులు మార్కర్ పెన్నులు వాడుతున్నారని MNS చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించారు. ‘ఇది కుట్ర. ఇలాంటి మోసపూరిత ఎన్నికలు ఎందుకు?’ అని ప్రశ్నించారు. సిస్టమ్‌ను మేనేజ్ చేసి ఎలాగైనా గెలవడానికే ప్రభుత్వం ఇలాంటి వేషాలు వేస్తోందని విమర్శించారు. డబుల్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉందని ఆరోపించారు. రాజకీయ పార్టీలను అడగకుండా ఇలాంటి మార్పులు చేయడంపై జనం అలర్ట్‌గా ఉండాలని పిలుపునిచ్చారు.


