News September 22, 2024
మూవీలో అనుమతి లేకుండా సీన్స్.. స్టార్ డైరెక్టర్ వార్నింగ్

తాను హక్కులు పొందిన ‘నవ యుగ నాయగన్ వేల్ పారి’ నవల నుంచి కొన్ని సీన్లను వాడుకోవడం తనను ఇబ్బంది పెట్టినట్లు దర్శకుడు శంకర్ ట్వీట్ చేశారు. ఇటీవల విడుదలైన ఓ సినిమా ట్రైలర్‌లో ముఖ్యమైన సీన్‌ను గమనించానని తెలిపారు. దయచేసి నవలలోని సన్నివేశాలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో వాడొద్దని కోరారు. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఆయన ఏ సినిమాను ఉద్దేశించి అన్నారో అని చర్చ మొదలైంది.
Similar News
News October 18, 2025
వేదాల ప్రధాన లక్ష్యం ఇదే..

మానవాళిని 3 రకాల కష్టాల నుంచి విముక్తి కలిగించడమే వేదాల ప్రధాన లక్ష్యం. ఈ కష్టాలనే త్రిబాధలని అంటారు. అందులో మొదటిది మన శరీరానికీ, మనసుకీ వచ్చే సమస్యలు. రెండోది ఇతరులు, జంతువుల వల్ల కలిగే బాధలు. చివరిది ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే కష్టాలు. ఈ మూడు బాధలు తొలగి, ప్రతి ఒక్కరూ జీవితంలో నిజమైన శాంతిని, సుఖాన్ని పొందాలని వేదం కోరుకుంటుంది. ఇందుకోసం భగవంతుడిని ప్రార్థించమని ఉద్బోధిస్తుంది. <<-se>>#VedikiVibes<<>>
News October 18, 2025
తెలంగాణ బంద్.. ఇది ఎవరిపై పోరాటం?

TG: రాష్ట్ర బంద్ ఎవరికి వ్యతిరేకంగా జరుగుతోంది? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. 42% శాతం రిజర్వేషన్ల కోసం BC సంఘాలు బంద్ చేపట్టాయి. దానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్, కేంద్ర అధికార పార్టీ BJP కూడా మద్దతు తెలిపాయి. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే మరి బంద్ ఎవరికి వ్యతిరేకంగా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వానికా? రాష్ట్ర ప్రభుత్వానికా? అసలు పోరాటం ఎవరిపై?
News October 18, 2025
పవన్-లోకేశ్ కాంబోలో సినిమా?

టాలీవుడ్‌లో క్రేజీ కాంబో సెట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ పవన్‌తో మూవీ లాక్ చేసుకుంది. ఆ అవకాశం తమిళ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్‌కు దక్కబోతోందని టాలీవుడ్‌లో టాక్ స్టార్ట్ అయ్యింది. అలాగే డైరెక్టర్ హెచ్.వినోద్ పేరు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నట్లు చెబుతున్నారు.