News September 22, 2024

చిరంజీవికి సీఎం అభినందనలు

image

మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కడం గర్వించదగ్గ విషయమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేశారు. మరో వైపు చిరంజీవికి కంగ్రాట్స్ చెబుతూ మెగా అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ఏ రికార్డు అయినా మెగాస్టార్‌కు దాసోహం అనాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News September 22, 2024

రాజకీయాల్లో తమ్ముడు.. సినిమాల్లో అన్నయ్య

image

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వేర్వేరు విభాగాల్లో ప్రపంచ రికార్డులు అందుకోవడం విశేషం. APలో ఒకే రోజు 13,326 గ్రామాల్లో సభలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు Dy.CM పవన్ సర్టిఫికెట్ అందుకున్నారు. మరోవైపు <<14167123>>చిరు<<>> ఇవాళ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇది అరుదైన ఘటన అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

News September 22, 2024

గిన్నిస్ రికార్డ్స్‌లో ఈ టాలీవుడ్ ప్రముఖులూ..

image

తన డాన్సులకు గాను మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో మరికొంత మంది ప్రముఖులు కూడా ఈ ఘనత సాధించారు. అత్యధిక చిత్రాల నిర్మాతగా రామానాయుడు, అత్యధిక చిత్రాల దర్శకుడిగా దాసరి, అత్యధిక చిత్రాల దర్శకురాలిగా విజయనిర్మల, బతికున్న వారిలో అత్యధిక చిత్రాల్లో నటించిన వ్యక్తిగా బ్రహ్మానందం, అత్యధిక పాటలు పాడినవారిగా SPB, సుశీల చరిత్రకెక్కారు.

News September 22, 2024

బిగ్ బాస్-8: అభయ్ ఎలిమినేట్

image

తెలుగు బిగ్ బాస్-8లో మూడో వారం నటుడు అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు. ఈ మేరకు హోస్ట్ నాగార్జున అతడిని ఎలిమినేట్ చేసినట్లు ప్రకటించారు. ఈ వారం అభయ్ ప్రవర్తనకు హోస్ట్ నాగార్జున రెడ్ కార్డు ప్రకటించారు. నిన్ననే హౌస్ నుంచి బయటకు వెళ్తారని భావించినా అనూహ్య పరిస్థితుల నడుమ ఇవాళ ఎలిమినేట్ అయ్యారు.