News September 22, 2024
‘టీ’లో బిస్కెట్లు ముంచుకుని తింటున్నారా?

‘టీ’లో బిస్కెట్లు ముంచుకుని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చాయ్‌లో బిస్కెట్లు తింటే అధిక షుగర్ కంటెంట్ శరీరానికి చేరుతుంది. బిస్కెట్లను షుగర్, మైదాపిండితో తయారు చేయడంతో చక్కెర స్థాయులు పెరుగుతాయి. శరీరంలో వాపు, హార్మోన్ల అసమతుల్యత, ఇన్సులిన్ నిరోధకత, బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. గుండె సంబంధిత సమస్యలూ వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. హెర్బల్ టీ తాగడం ఉత్తమం.
Similar News
News February 25, 2026
పట్టణాల్లో ఇళ్లు లేని వారికి GOOD NEWS

PMAY- U 2.0 కింద కొత్తగా 2.88L ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. ఇందులో మహిళలకు 1.60L గృహాలు, సీనియర్ సిటిజన్లకు 22,581, SCలకు 35,525, STలకు 9,773, OBCలకు 82,190 ఇళ్లను కేటాయించనుంది. దీంతో ఈ స్కీమ్‌లో పట్టణాలకు మంజూరు చేసిన మొత్తం ఇళ్ల సంఖ్య 13.61Lకు చేరింది. తాజా నిర్ణయంతో AP, TG సహా 16 రాష్ట్రాలు లబ్ధి పొందనున్నాయి. కాగా ఈ పథకం కింద ప్రభుత్వం రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సాయం చేయనుంది.
News February 25, 2026
నేడు వెలిగొండకు సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. దోర్నాల(M) గంటవానిపల్లి వద్ద రూ.456 కోట్లతో చేపడుతున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం తర్లుపాడులో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత సీఎం అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి.
News February 25, 2026
ఈ పొరపాటు చేస్తే పశువులకు అబార్షన్ అవుతుంది

కొన్ని పశువులు గర్భంతో ఉన్నప్పటికీ తీగలు వేస్తుంటాయి. దీనికి కారణం పశువులు గర్భంతో ఉన్నప్పుడు 4 లేదా 5వ నెలలో ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల తీగలు వేస్తాయి. దీన్నే జస్టేషనల్ హీట్ అంటారు. అందుకే ఎద ఇంజెక్షన్ వేసిన మూడు నెలల తర్వాత పశువులకు చూడి నిర్ధారణ పరీక్ష తప్పకుండా నిర్వహించాలి. ఇది చేయకుండా తీగలు వేసిందని మళ్లీ ఎద ఇంజెక్షన్ వేయిస్తే అబార్షన్ అవుతుందని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


