News September 22, 2024

OG నుంచి అప్డేట్.. తమన్ ట్వీట్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘OG’. ఈ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. త్వరలోనే మాస్ ర్యాంపేజ్ అంటూ సంగీత దర్శకుడు తమన్ పోస్ట్ చేశారు. దర్శకుడు సుజిత్, తమిళ నటుడు శింబుతో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. ఈ సినిమాలో శింబు ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. దీంతో తొలి సాంగ్‌ను విడుదల చేస్తారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News January 8, 2026

స్పర్శిస్తూ కళను అనుభూతి చెందుతున్నారు!

image

కళను కళ్లతో చూడడమే కాదు చేతులతో తాకి అనుభూతి చెందవచ్చని నిరూపిస్తోంది జైపూర్‌లోని(RJ) ‘రాజస్థాన్ నేత్రహీన్ కళ్యాణ్ సంఘ్’. St+art ఫౌండేషన్‌ చేపట్టిన ‘స్పర్శ్’ ప్రాజెక్ట్ ద్వారా అంధ విద్యార్థుల కోసం గోడలపై ‘టాక్టైల్ ఆర్ట్’ను రూపొందించారు. బ్రెయిలీ లిపి, టెక్స్‌చర్డ్ పెయింట్స్‌తో తీర్చిదిద్దిన ఈ చిత్రాలను స్పర్శిస్తూ అంధ విద్యార్థులు రాజస్థాన్ సంస్కృతిని అనుభూతి చెందుతున్నారు.

News January 8, 2026

AP క్యాబినెట్ నిర్ణయాలు

image

* వైద్యుడు సుధాకర్ ఫ్యామిలీకి రూ.కోటి సహాయం. ఆయన కొడుకు సి.కె.లలిత్ ప్రసాద్‌కు స్పెషల్ ప్రమోషన్ కింద డిప్యూటీ తహశీల్దార్‌గా పదోన్నతి
* పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
* పాఠశాల కిట్ల పంపిణీకి రూ.944.53కోట్లకు పరిపాలన అనుమతులు
* ఏపీ లాజిస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం
* 39.52 లక్షల విద్యార్థులకు పెండింగ్‌లో పెట్టిన సొమ్ము చెల్లింపునకు ఆమోదం

News January 8, 2026

ఆ పోర్నోగ్రఫీ చూసినా, షేర్ చేసినా జైలుకే!

image

చైల్డ్ పోర్నోగ్రఫీ చూసే వారిని TG సైబర్ సెక్యూరిటీ బ్యూరో ట్రేస్ చేస్తోంది. వీడియోలను చూస్తూ, షేర్ చేస్తున్న ఓ వ్యక్తిని ఖమ్మం పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నేషనల్ సెంటర్ ఆఫ్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ సంస్థ ‘సైబర్ టిప్ లైన్’ ద్వారా చైల్డ్ పోర్నోగ్రఫీ బ్రౌజింగ్‌పై పోలీసులకు అలర్ట్స్ పంపిస్తుంటుంది. గతేడాది TGకి 97,556 అలర్ట్స్ వచ్చాయి. 854 FIRలు నమోదవగా, 376 మంది అరెస్టయ్యారు.