News September 22, 2024

శ్రీవారితో నాకు ప్రత్యేక అనుబంధం: చంద్రబాబు

image

TG: తిరుమల శ్రీవారు తనకు పునర్జన్మ ప్రసాదించారని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీనివాసుడితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. ‘గతంలో వైఎస్‌ఆర్ ఏడు కొండలను రెండే కొండలు అన్నారు. వైసీపీ హయాంలో కొండపై అపవిత్ర కార్యక్రమాలు జరిగాయి. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తిరుమల లడ్డూను కూడా గత ప్రభుత్వం అపవిత్రం చేసింది. కానీ తమ ప్రభుత్వం తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News February 6, 2026

ఫిబ్రవరి 6: చరిత్రలో ఈరోజు

image

✒ 1890: స్వాతంత్ర్య సమర యోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జననం ✒ 1931: సమరయోధుడు మోతిలాల్ నెహ్రూ మరణం ✒ 1932: రచయిత భమిడిపాటి రామగోపాలం జననం ✒ 1947: ప్రముఖ రచయిత్రి కె.వి.కృష్ణకుమారి జననం ✒ 1956: AP అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్ ప్రతిభా భారతి జననం ✒ 2008: హాస్యనటి కల్పనా రాయ్ మరణం ✒ 2022: సింగర్ లతా మంగేష్కర్ మరణం(ఫొటోలో)

News February 6, 2026

ఓటీటీలోకి వచ్చేసిన ‘రాజాసాబ్’

image

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ మూవీ అర్ధరాత్రి నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. గత నెల 9న థియేటర్లలో రిలీజైన ఈ హారర్ ఫాంటసీ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. 28 రోజుల్లోనే ఓటీటీలోకి రావడం గమనార్హం. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు.

News February 6, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.