News September 22, 2024

రేపు తిరుమలలో శాంతియాగం: చంద్రబాబు

image

AP: జరిగిన తప్పులు క్షమాపణకు శాంతి యాగం చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రేపు ఉదయం 6 గంటలకు శాంతి హోమం, పంచద్రవ్య సంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద చేస్తామన్నారు. ఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో అధికార దుర్వినియోగంపై సిట్ వేస్తామని చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడటం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామన్నారు.

Similar News

News September 23, 2024

టీడీపీని తిరుగులేని శక్తిగా మారుస్తాం: చంద్రబాబు

image

AP: పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని CM చంద్రబాబు తెలిపారు. త్వరలోనే పోస్టుల భర్తీ చేపడతామని పేర్కొన్నారు. కూటమిలోని మూడు పార్టీల్లో కష్టపడ్డ నేతలకు ప్రాధాన్యమిస్తామని అన్నారు. టీడీపీకి కార్యకర్తలే బలమని, వారి త్యాగాలను మర్చిపోలేమన్నారు. కార్యకర్తల ప్రమాద బీమాను రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచినట్లు చెప్పారు. 2029 నాటికి టీడీపీని తిరుగులేని శక్తిగా మారుస్తామన్నారు.

News September 23, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: సెప్టెంబర్ 23, సోమవారం ✒ ఫజర్: తెల్లవారుజామున 4:53 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6:05 గంటలకు ✒ జొహర్: మధ్యాహ్నం 12:08 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4:30 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 6:12 గంటలకు ✒ ఇష: రాత్రి 7.24 గంటలకు నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 23, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.