News September 22, 2024
ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకూ పాక్తో చర్చలుండవు: అమిత్ షా

పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేవరకూ ఆ దేశంతో చర్చలు జరిపేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. జమ్మూకశ్మీర్లో ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. ‘కశ్మీర్లో త్రివర్ణ పతాకం మాత్రమే ఎగురుతుంది. పాక్తో మాట్లాడాలని ప్రతిపక్షాలంటున్నాయి. ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోయేవరకు అది జరగని పని. బీజేపీ మీకు హామీ ఇస్తోంది. ఒక్క ఉగ్రవాదిని కూడా విడిచిపెట్టం’ అని స్పష్టం చేశారు.
Similar News
News August 30, 2025
పంచాయతీరాజ్ యాక్ట్ Sec.285(A)లో ఏముంది?

BRS ప్రభుత్వం 2018లో పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇందులో పార్ట్ 8 <<17562517>>సెక్షన్ 285<<>> (A)లో రిజర్వేషన్లపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక ఎన్నికల్లో SC/ST/OBCల రిజర్వేషన్లు 50% దాటకూడదు అని పేర్కొనబడింది. జనాభా, భౌగోళిక సమీకరణాలతో RDOలు సీట్ల వారీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించి బీసీలకు ప్రత్యేకంగా 42% రిజర్వేషన్లు ఇవ్వనుంది.
News August 30, 2025
50 ఆయుధాలతోనే పాక్ పని ఖతం: తివారీ

ఆపరేషన్ సిందూర్లో భారత్ 50 ఆయుధాలనే ప్రయోగించిందని ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ తెలిపారు. దీంతో పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చిందని ఆయన చెప్పారు. ‘యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని మన బలగాలను సంసిద్ధంగా ఉంచాం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా బలగాలను మోహరించాం. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగాక 29న టార్గెట్ సెట్ చేసి మే 7న అటాక్ చేశాం’ అని ఆయన పేర్కొన్నారు.
News August 30, 2025
దుబాయ్లో ఎండలు.. ఐసీసీ కీలక నిర్ణయం?

ఆసియా కప్ మ్యాచుల ప్రారంభ సమయాన్ని ICC మార్పు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం 19 మ్యాచులకు గానూ 18 మ్యాచులకు సమయం మార్చినట్లు తెలుస్తోంది. ఇందులో ఫైనల్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ ప్రకారం ఇండియాలో ప్రతీ మ్యాచ్ రా.8 గంటలకు ప్రారంభం కానుంది. టైమింగ్స్ మార్పునకు ఎండ తీవ్రతలే కారణమని తెలుస్తోంది. దుబాయ్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో ICC ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.