News September 22, 2024

లడ్డూను అపవిత్రం చేసిన వారిపై చర్యలు: టీటీడీ ఈఓ

image

AP: తిరుమల లడ్డూ అపవిత్రతపై సిట్ ఏర్పాటు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని TTD ఈఓ శ్యామలరావు తెలిపారు. ‘ప్రస్తుతం నందిని, ఆల్ఫా సంస్థల నుంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కిలో రూ.475కు కొంటున్నాం. దోషాలను తొలగించడానికి ఇప్పటికే పాప ప్రోక్షణ హోమాలు నిర్వహించాం. అనుభవజ్ఞులైన 18 మందితో సెన్సరీ ప్యానల్ ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే తిరుమలలో FSSL ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 23, 2024

క్వాడ్ సదస్సుపై చైనా మీడియా అక్కసు

image

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నివాసంలో క్వాడ్ దేశాల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సులో PM మోదీ, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు ఆంటోని ఆల్బనీస్, ఫుమియో కిషిదాలు హాజరయ్యారు. దీనిపై చైనా అధికారిక మీడియా అక్కసు వెళ్లగక్కింది. చైనాను నియంత్రించడంపై క్వాడ్ దృష్టి సారించిందని పేర్కొంది. చైనా, దాని పొరుగు దేశాల మధ్య విభేదాలను సృష్టించడానికి విభజించు, పాలించు వ్యూహాన్ని అమలు చేస్తోందని ఆరోపించింది.

News September 23, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 23, 2024

టీడీపీని తిరుగులేని శక్తిగా మారుస్తాం: చంద్రబాబు

image

AP: పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని CM చంద్రబాబు తెలిపారు. త్వరలోనే పోస్టుల భర్తీ చేపడతామని పేర్కొన్నారు. కూటమిలోని మూడు పార్టీల్లో కష్టపడ్డ నేతలకు ప్రాధాన్యమిస్తామని అన్నారు. టీడీపీకి కార్యకర్తలే బలమని, వారి త్యాగాలను మర్చిపోలేమన్నారు. కార్యకర్తల ప్రమాద బీమాను రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచినట్లు చెప్పారు. 2029 నాటికి టీడీపీని తిరుగులేని శక్తిగా మారుస్తామన్నారు.