News September 22, 2024

రాజకీయాల్లో తమ్ముడు.. సినిమాల్లో అన్నయ్య

image

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వేర్వేరు విభాగాల్లో ప్రపంచ రికార్డులు అందుకోవడం విశేషం. APలో ఒకే రోజు 13,326 గ్రామాల్లో సభలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు Dy.CM పవన్ సర్టిఫికెట్ అందుకున్నారు. మరోవైపు <<14167123>>చిరు<<>> ఇవాళ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇది అరుదైన ఘటన అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News September 23, 2024

ఈ ఎయిర్‌పోర్ట్ యమ డేంజర్!

image

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఎయిర్ పోర్టుల్లో భూటాన్‌లోని పారా విమానాశ్రయం ఒకటి. ఇక్కడ ల్యాండ్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 50 మంది పైలెట్లకే అనుమతి ఉంది. వీరిని ఏవియేషన్‌లో డేర్ డెవిల్స్ అంటారు. ఈ రన్ వే పొడవు 2,264 మీ మాత్రమే. చుట్టూ 18 వేల అడుగుల ఎత్తైన కొండలు ఉంటాయి. వాతావరణ మార్పుల వల్ల పగలు ఫ్లైట్లు అస్సలు కదలవు. రాత్రి వేళల్లో రాడార్ పనిచేయదు. అందుకే ఇది అత్యంత డేంజర్ ఎయిర్‌పోర్ట్ .

News September 23, 2024

పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగినట్లుగా వారి వైఖరి: హరీశ్

image

TG: మంత్రి శ్రీధర్ బాబు <<14169541>>వ్యాఖ్యలు<<>> నవ్వితే నాకేంటి సిగ్గు అన్నట్లుగా ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు. ఒక పార్టీ ఎమ్మెల్యే మరొక పార్టీ సీఎల్పీ సమావేశానికి ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. తన నియోజకవర్గానికి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వస్తే కలుస్తానేమో గానీ ఇలాంటి సమావేశాలకు కలవనని తేల్చి చెప్పారు. పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగినట్లుగా కాంగ్రెస్ వైఖరి ఉందని దుయ్యబట్టారు.

News September 23, 2024

సెప్టెంబర్ 23: చరిత్రలో ఈరోజు

image

1976: దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ జననం
1985: క్రికెటర్ అంబటి రాయుడు జననం
1993: నటి షాలిని పాండే జననం
1996: నటి సిల్క్ స్మిత మరణం
2019: నటుడు కోసూరి వేణుగోపాల్ మరణం
✤అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం