News September 23, 2024

కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, గద్వాల్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మేడ్చల్, మెదక్, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, భువనగిరి, సూర్యాపేటలో మోస్తరు వర్షాలు పడతాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Similar News

News September 18, 2025

జగిత్యాల: ‘జీపీఎఫ్ ప్రతిపాదనలు నేరుగా జడ్పీలోనే స్వీకరించాలి’

image

ఉపాధ్యాయుల జీపీఎఫ్ ప్రతిపాదనలను గతంలో మాదిరిగానే నేరుగా జడ్పీ కార్యాలయంలోనే స్వీకరించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. టీఆర్‌టీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు తుంగూరి సురేష్, ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ గౌడ్ గురువారం జడ్పీ డిప్యూటీ సీఈఓ నరేష్‌కు వినతిపత్రం అందజేశారు.

News September 18, 2025

అసెంబ్లీ సమావేశాలు కుదింపు

image

AP: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల పనిదినాలను ప్రభుత్వం 8 రోజులకు కుదించింది. ఈనెల 27 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత అసెంబ్లీని ఈనెల 30 వరకు నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో <<17749258>>నిర్ణయించిన<<>> విషయం తెలిసిందే. అటు రేపు మధ్యాహ్నం రూ.1.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగనుంది. సభలో ఆమోదించాల్సిన అంశాలపై చర్చించనుంది.

News September 18, 2025

OCT 1 నుంచి అమల్లోకి ఆన్‌లైన్‌ గేమింగ్‌ చట్టం: కేంద్రం

image

ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించిన కొత్త <<17486290>>రూల్స్<<>> అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే గేమింగ్ కంపెనీలు, స్టేక్ హోల్డర్స్‌తో పలుమార్లు చర్చలు జరిపామన్నారు. రూల్స్ అమల్లోకి వచ్చే ముందు గేమింగ్ ఇండస్ట్రీతో మరోసారి చర్చిస్తామన్నారు. ఆన్‌లైన్ మనీ గేమ్స్‌ను నిషేధించేందుకు కేంద్రం ఇటీవల ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.