News September 23, 2024

ఖేడ్‌: ఆ మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలి: KVPS

image

నారాయణఖేడ్‌లో అధిక ధరలకు టాబ్లెట్లు అమ్ముతున్న మెడికల్ యజమానులపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం ఆయన స్థానిక కేవీపీఎస్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రజలకు అధిక ధరలకు మెడికల్ యజమానులు మందులు అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని.. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News January 22, 2026

గురుకుల ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు పొడగింపు

image

తెలంగాణ గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు ఈనెల 25 వరకు పొడిగించినట్లు జిల్లా కోఆర్డినేటర్ ఆఫీసర్ అనురాధ తెలిపారు. ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఈనెల 21 వరకు గడువు ఉండగా 25 వరకు పొడిగించినట్లు తెలిపారు. 2026- 27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి, 6 నుంచి 9వ తరగతి వరకు బ్యాక్ లాగ్ ఖాళీల భర్తీకి పరీక్ష నిర్వహిస్తున్నట్లు వివరించారు. అవకాశం వినియోగించుకోవాలని ఆమె కోరారు

News January 22, 2026

రామాయంపేట: అధికార కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ బెడద..!

image

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రామాయంపేట కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ బెడద నెలకొంది. మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులు ఉండగా ఒక్కో వార్డులో ముగ్గురు నలుగురు చొప్పున టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే టిక్కెట్టు రానివారు రిబ్బన్స్ గా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధినాయకులు మాత్రం రెబెల్స్ ను ప్రోత్సహించే నాయకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

News January 22, 2026

మెదక్: ఒంటరిగా జీవించలేక యువకుడి సూసైడ్

image

భార్యతో విడిపోయి ఒంటరిగా జీవించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన టేక్మాల్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంపూలూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ కొన్ని రోజుల క్రితం భార్యతో గొడవతో పెద్దల సమక్షంలో విడిపోయాడు. అప్పటి నుంచి మనస్తాపంతో తాగుడుకు బానిసైన ప్రశాంత్.. సోమవారం గ్రామ శివారులో పురుగు మందు తాగాడు. గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.