News September 23, 2024

ఈ ఎయిర్‌పోర్ట్ యమ డేంజర్!

image

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఎయిర్ పోర్టుల్లో భూటాన్‌లోని పారా విమానాశ్రయం ఒకటి. ఇక్కడ ల్యాండ్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 50 మంది పైలెట్లకే అనుమతి ఉంది. వీరిని ఏవియేషన్‌లో డేర్ డెవిల్స్ అంటారు. ఈ రన్ వే పొడవు 2,264 మీ మాత్రమే. చుట్టూ 18 వేల అడుగుల ఎత్తైన కొండలు ఉంటాయి. వాతావరణ మార్పుల వల్ల పగలు ఫ్లైట్లు అస్సలు కదలవు. రాత్రి వేళల్లో రాడార్ పనిచేయదు. అందుకే ఇది అత్యంత డేంజర్ ఎయిర్‌పోర్ట్ .

Similar News

News September 23, 2024

పఠాన్ మూవీ సీక్వెల్‌కి రంగం సిద్ధం

image

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్ సూపర్ హిట్ మూవీ పఠాన్‌కి సీక్వెల్ రాబోతోంది. చిత్ర రచయితగా పని చేసిన అబ్బాస్ టైరేవాలా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. పఠాన్-2కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని తెలిపారు. కొద్ది రోజుల్లో మూవీపై అధికారిక ప్రకటన వస్తుందని వెల్లడించారు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో తెరకెక్కిన పఠాన్ మూవీ 2023లో విడుదలైంది. ఇందులో ‘రా’ ఏజెంట్‌గా షారుఖ్ కనిపించారు.

News September 23, 2024

BIG ALERT.. భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో AP, TGలో ఇవాళ భారీ వర్షాలు కురవనున్నాయి. ADB, ASF, మంచిర్యాల, PDPL, భూపాలపల్లి, ములుగు, RR, MBNR, NGKL, వనపర్తి, NRPT జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. అటు APలోని మన్యం, అల్లూరి, ELR, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, OGL, KNL, నంద్యాల, ATP జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

News September 23, 2024

జనరల్‌ బోగీలో టికెట్ లేకుండా ప్రయాణిస్తే..?

image

రైళ్లలో జనరల్ బోగీల్లో టికెట్ ధర తక్కువే అయినప్పటికీ కొందరు నిర్లక్ష్యంతో టికెట్ లేకుండానే ప్రయాణిస్తుంటారు. అలాంటి వారు పట్టుబడితే రూ.250 వరకు జరిమానా ఉంటుంది. దాంతో పాటు అప్పటి వరకు ప్రయాణించిన దూరానికి ఛార్జీని కూడా చెల్లించాలి. చెల్లించకపోతే వారిని రైల్వే పోలీసులకు అప్పగించే హక్కు టీసీకి ఉంటుంది. ఇక ఈ తప్పును పదే పదే చేసేవారికి శిక్షల తీవ్రత కూడా అలాగే పెరుగుతుంటుంది.