News September 23, 2024
IPLలో వచ్చే సీజన్ కూడా ఆడనున్న ధోనీ?

IPLలో MS ధోనీ మరిన్ని సీజన్లు ఆడాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన మాత్రం ఆ విషయాన్ని మిస్టరీగా ఉంచుతున్నారు. అయితే త్వరలోనే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ వచ్చేలా ఉంది. ధోనీని CSK రిటెయిన్ చేసుకోనున్నట్లు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. దీంతో వచ్చే సీజన్ కూడా ఆయన బరిలో దిగే అవకాశం ఉంది. ఇక ధోనీతో పాటు జడేజా, గైక్వాడ్, దూబే, పతిరణను CSK రిటెయిన్ చేసుకోనున్నట్లు సమాచారం.
Similar News
News February 5, 2026
ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

ఖమ్మం (D)లో క్యాన్సర్ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 1,883 యాక్టివ్ కేసులు ఉండగా, బాధితుల్లో మహిళలే 1,418 మంది ఉన్నారు. ముఖ్యంగా రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. జిల్లాలోని 31 PHC, 7CHCలతో పాటు ప్రభుత్వాసుపత్రిలో రోగులను గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఆహార అలవాట్లు, జీవనశైలిలో మార్పుల ద్వారా ఈ మహమ్మారిని నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
News February 5, 2026
ఏపీలోని ESIC హాస్పిటల్‌లో ఉద్యోగాలు

AP: కాకినాడలోని <
News February 5, 2026
తులసి మొక్కను నాటుతున్నారా?

తులసి మొక్క నాటేందుకు గురు, శుక్రవారాలు శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు. ఏకాదశి తిథి, ఆది, సోమవారాలతో పాటు గ్రహణ సమయంలో నాటకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ మొక్క ఇంటికి ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిశలో ఉంటే మంచి జరుగుతుందని వాస్తు నిపుణుల సూచన. దక్షిణ, నైరుతి దిశల్లో అస్సలు ఉంచకూడదంటున్నారు. అయితే తులసి మొక్కను ఎవరు నాటాలి, ఎవరు నాటకూడదో అని నియమాలున్నాయి. వాటి పూర్తి వివరాలకై క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


