News September 23, 2024
ఇద్దరు మహిళల్ని ఉరి తీయించిన కిమ్ జాంగ్
ఉత్తర కొరియాలో పరిస్థితుల గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఇద్దరు మహిళల్ని ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉరి తీయించారు. వారిద్దరూ చైనాలో నివాసం ఉంటున్నారు. ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియా పారిపోవాలనుకున్న వారికి ఆ ఇద్దరూ సాయం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో వారిని కిమ్ స్వదేశానికి రప్పించి, విచారణ చేయించి ఉరి శిక్ష అమలు చేయించారు. ఇలాంటి ఆరోపణలే ఉన్న మరో 9మందికి జీవిత ఖైదు విధించారు.
Similar News
News December 30, 2024
జనవరి 1 నుంచి ఇలాంటి బ్యాంక్ అకౌంట్లు క్లోజ్
బ్యాంకింగ్ కార్యకలాపాల్లో లోపాలను పరిష్కరించడానికి, స్కామ్‌లను అరికట్టడానికి జనవరి 1 నుంచి ఆర్బీఐ కీలక మార్పులు చేస్తోంది. పలు రకాల బ్యాంక్ ఖాతాలను మూసివేయనుంది. అవి ఏంటంటే?
ఇనాక్టీవ్ అకౌంట్: ఏడాదిపాటు ఉపయోగంలో లేని ఖాతా.
డార్మాంట్ అకౌంట్: రెండేళ్లపాటు ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతా.
జీరో బ్యాలెన్స్ అకౌంట్: ఆయా బ్యాంకులను బట్టి ఎక్కువ కాలం జీరో బ్యాలెన్స్ కొనసాగించే ఖాతాలు.
News December 30, 2024
రాహుల్ వియత్నాం వెళ్తే BJPకి నొప్పేంటి: కాంగ్రెస్
రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై BJP, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దేశం సంతాప దినాలు జరుపుకుంటుంటే రాహుల్ న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్లారని BJP నేత అమిత్ మాలవీయ విమర్శించారు. ‘డైవర్షన్ పాలిటిక్స్‌ను సంఘీలెప్పుడు ఆపేస్తారు? MMS అంత్యక్రియలను యమున ఒడ్డున నిర్వహించకపోవడం సిగ్గుచేటు. అయినా రాహుల్ విదేశీ యాత్రపై మీకెందుకు బాధ? న్యూఇయర్‌లోనైనా బాగుపడండి’ అని మాణికం ఠాగూర్ అన్నారు.
News December 30, 2024
సినిమా వాళ్లతో రేవంత్ సెటిల్మెంట్ చేసుకున్నారు: కేటీఆర్
TG: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అల్లు అర్జున్‌ను సీఎం రేవంత్ టార్గెట్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. సినిమా వాళ్లతో సీఎం సెటిల్మెంట్ చేసుకున్నారని, అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారంపై ఏం మాట్లాడట్లేదని మీడియాతో చిట్ చాట్‌లో వ్యాఖ్యానించారు. గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులకు, ఆటో డ్రైవర్లు, రైతులు, నేతన్నల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.