News September 23, 2024

NZB: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు.. పదిమంది అరెస్ట్

image

నగరంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు వన్ టౌన్ పరిధిలోని నాగేంద్రుడి గుడి వెనకాల గల ప్రదేశంలో పేకాట ఆడుతుండగా వన్ టౌన్ SHO విజయబాబు, తన సిబ్బందితో ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పదిమంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9200 నగదు, రెండు బైక్లు, 9 స్మార్ట్ ఫోన్ లను స్వాధీన పరుచుకున్నారు.

Similar News

News December 30, 2024

క్రైమ్ రేటుపై చర్చకు సిద్ధం: మోహన్ రెడ్డి

image

ఉనికి కోసమే కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత అబద్ధపు మాటలు చేస్తున్నారని రాష్ట్ర సహకార యునియన్ లిమిటెడ్ ఛైర్మన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. మాయ మాటలు చెప్పడంలో కేసీఆర్ కుటుంబాన్ని మించిన వారు రాష్ట్రంలో లేరని వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వ హయంలో క్రైమ్ రేట్ పెరిగిందో, తగ్గిందో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మీరు సిద్ధమైతే మాతో చర్చకు రావాలని సవాల్ చేశారు. ఇచ్చిన హామీల్లో 80% అమలు చేశామన్నారు.

News December 30, 2024

ప్రజల ఇళ్లపైకి బుల్డోజర్లను తీసుకెళ్తే ఊరుకోం: MLC కవిత

image

ప్రజల ఇళ్లపైకి బుల్డోజర్లను తీసుకెళ్తే ఊరుకోబోమని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో హైడ్రా పెట్టినట్టు నిజామాబాద్‌లో నిడ్రా పెడుతామని పీసీసీ అధ్యక్షుడు చెప్పడం దారుణమన్నారు. బుల్డోజర్‌తో ప్రజల ఆస్తులు కూలగొడుతామని హెచ్చరిస్తున్నారని, దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆమె పేర్కొన్నారు.

News December 30, 2024

దేశమంతటికీ ఆమె గర్వకారణంగా నిలిచింది: MP అర్వింద్

image

భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపి ఫీడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చేస్ ఛాంపియన్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోనేరు హంపీకి ‘X’ వేదికగా అభినందనలు తెలిపారు. ఈ వేదికగా ఆమె ఫోటోను జోడించిన ఎంపీ అర్వింద్ ఈ అపూర్వ విజయంతో ఆమె దేశమంతటికీ గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించారు.