News September 23, 2024
కామ్రేడ్ దిసనాయకేకు CPI(M) అభినందనలు

శ్రీలంక అధ్యక్షునిగా ఎన్నికైన మార్క్సిస్ట్ నేత అనురకుమార దిసనాయకేకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్) అభినందనలు తెలిపింది. శ్రీలంక చరిత్రలో తొలిసారి ఓ కమ్యూనిస్ట్ నేత అధ్యక్ష పీఠంపై కూర్చోనున్న ఈ సందర్భం ఎంతో మహత్తరమైనదని పేర్కొంది. శ్రీలంకను దిసనాయకే ప్రగతి పథంలో నడిపిస్తారనే విశ్వాసం తమకు ఉందని చెప్పింది.
Similar News
News January 28, 2026
పంటలకు పురుగుల బెడద.. నివారణ ఎలా?

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల ప్రధాన పంటలకు చీడపీడల బెడద పెరిగింది. మామిడిలో తేనెమంచు పురుగు, వరిలో కాండం తొలిచే పురుగు, మిరపలో తామర పురుగు, మొక్కజొన్నలో కత్తెర పురుగుల ఉద్ధృతి పెరిగింది. జీడిమామిడిలో టీ దోమ, మినుములో కాండం ఈగ సమస్య ఎక్కువైంది. వీటిని సకాలంలో కట్టడి చేయకుంటే ఈ పంటలకు తీవ్ర నష్టం తప్పదు. ఈ పురుగులను ఎలా నివారించాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.
News January 28, 2026
WPL: ఒకే ఓవర్లో 4, 4, 4, 4, 1, 6

IPL తరహాలో WPLలో బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. నిన్న గుజరాత్‌తో మ్యాచులో ఢిల్లీ బ్యాటర్లు నికీ ప్రసాద్(9 ఫోర్లు), స్నేహ్ రాణా(3 ఫోర్లు, 2 సిక్సులు) చెలరేగారు. 17వ ఓవర్లో తొలి 4 బంతుల్లో నికీ ఫోర్లు బాదగా, చివరి బంతిని రాణా సిక్సర్‌గా మలిచారు. 19వ ఓవర్లో రాణా తొలి 3 బంతుల్లో 6, 4, 4 బాదారు. ఐదో బంతిని నికీ ఫోర్ కొట్టారు. కానీ చివరి ఓవర్లో తడబడి <<18979077>>మ్యాచును<<>> చేజార్చుకున్నారు.
News January 28, 2026
రూ.90వేల జీతంతో AWEILలో ఉద్యోగాలు

అడ్వాన్స్‌డ్ వెపన్స్& ఇక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (<


