News September 23, 2024
NLG: మూసీ గేట్లు ఓపెన్..

మూసీకి వరద పొటెత్తగా అధికారులు ప్రాజెక్టు గేట్లు తెరిచారు. హెచ్చరికలు లేకుండా నీటిని వదలడంతో కేతపల్లి మండలం భీమారంలో వరద పొట్టెత్తింది. పశువుల కాపర్లు వాగులో చిక్కుకున్నారు. 20 గేదెలు, ట్రాక్టర్ కొట్టుకుపోయింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ శివరామ్ రెడ్డి ఆదేశాలతో వారిని జేసీబీ సాయంతో తీసుకోచ్చారు. హెచ్చరికలు లేకుండా గేట్లు ఎత్తడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 3, 2026
రోడ్డు భద్రత.. అందరి బాధ్యత: నల్గొండ ఎస్పీ

రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక గోడపత్రికలను ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి, జిల్లా రవాణా అధికారి లావణ్య తదితరులు పాల్గొన్నారు.
News January 2, 2026
అంతా సిద్ధంగా ఉండాలి: నల్గొండ ఇన్‌ఛార్జ్ అదనపు కలెక్టర్

పురపాలక ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలని, స్థానిక సంస్థల ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లతో రానున్న మున్సిపల్ ఎన్నికలపై సంసిద్ధత సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికలకు ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.
News January 2, 2026
ప్రజావాణి ఫిర్యాదులకు పరిష్కారం చూపాలి: నల్గొండ కలెక్టర్

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు చురుకుగా వ్యవహరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి ఆయన శుక్రవారం తన ఛాంబర్‌లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారుల పాత్ర ముఖ్యమని, ముఖ్యంగా ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు కచ్చితమైన పరిష్కారం అందించాలని సూచించారు.


