News September 23, 2024

పాలస్తీనా అధ్యక్షుడిని కలిసిన ప్రధాని మోదీ

image

న్యూయార్క్‌లో జరుగుతున్న సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్ సందర్భంగా పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. గాజాలో మానవతా సంక్షోభం, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రజలకు భారత్ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. పాలస్తీనాను గుర్తించిన మొదటి దేశాల్లో భారత్ ఒకటని గుర్తుచేసిన మోదీ, UNలో ఆ దేశ సభ్యత్వానికి మద్దతు తెలియజేశారు.

Similar News

News September 23, 2024

కొత్త పెన్షన్లపై BIG UPDATE

image

AP: కొత్త పెన్షన్లను అక్టోబర్ నుంచి అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో తొలగించిన లక్షల మంది లబ్ధిదారుల వివరాలను సేకరిస్తోంది. గ్రామ సభలు నిర్వహించి ఆరు అంచెల తనిఖీల తర్వాత వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల్లో అర్హులు, అనర్హులను గుర్తించనున్నారు. సచివాలయాల్లో జాబితాను ప్రదర్శించి, అనర్హుల నుంచి వివరణ తీసుకుంటారు. క్యాబినెట్ సబ్ కమిటీ దీనిపై త్వరలో విధివిధానాలు ప్రకటించే ఛాన్సుంది.

News September 23, 2024

అదే జరిగితే పోటీ చేయను: ట్రంప్

image

ఈ ఎలక్షన్స్‌లో గెలవకుంటే 2028లో మళ్లీ పోటీ చేయనని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కొవిడ్ టైమ్‌లో తన పాలన బాగుందన్నారు. సాధారణంగా ఓటమిని అంగీకరించని ఆయన ఇలా మాట్లాడటం ఇంట్రెస్టింగ్‌గా మారింది. 2020లో మాదిరిగా భారీ స్థాయిలో మోసగిస్తే, తప్పుడు ఆరోపణలు చేస్తేనే అలా జరుగుతుందని ట్రంప్ చెప్పే సంగతి తెలిసిందే. 2028 నాటికి ఆయనకు 82ఏళ్లు వస్తాయి.

News September 23, 2024

‘దేవర’ ఈవెంట్‌ను అందుకే రద్దు చేశాం: శ్రేయాస్ మీడియా

image

‘దేవర’ ఈవెంట్ రద్దుపై శ్రేయాస్ మీడియా ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. ‘పోలీసులు 4వేల మంది హాజరయ్యేందుకు పర్మిషన్ ఇచ్చారు. కానీ 30-35 వేల మంది రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఫ్యాన్స్ సేఫ్టీ కోసమే ఈవెంట్ రద్దు చేశాం. మమ్మల్ని క్షమించండి. అవుట్ డోర్ ఈవెంట్ కోసం ప్రయత్నించాం. కానీ గణేశ్ నిమజ్జనం, వెదర్ అలర్ట్స్ వల్ల సాధ్యం కాలేదు. పరిమితికి మించి పాసులు జారీ చేశామన్న ఆరోపణలు అవాస్తవం’ అని పేర్కొంది.