News September 23, 2024

కరీంనగర్: నేటి నుంచి పలు రైళ్ల రద్దు

image

కాజీపేట-బల్లార్ష మధ్య రైల్వే ట్రాక్ పనుల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి బల్లార్షా వరకు నడిచే పలు రైళ్లను నేటి నుంచి అక్టోబర్ 8వరకు రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్లించారు. రైళ్ల రద్దుతో దసరా పండుగ నేపథ్యంలో పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట ప్రజలకు ప్రయాణ కష్టాలు ఎదురుకానున్నాయి. విద్యార్థులు, వ్యాపారస్థులు, ఉద్యోగులు ప్రయాణాలకు ఆర్టీసీపై ఆధారపడాల్సి ఉంటుంది.

Similar News

News October 1, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.82,779 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.45,632, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.20,000, అన్నదానం రూ.17,147 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News October 1, 2024

KNR: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఆలోచనలో పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.

News October 1, 2024

జగిత్యాల జిల్లా DSC టాపర్‌గా జిందం అజయ్‌కుమార్

image

నిన్న విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో కోరుట్లకు చెందిన జిందం అజయ్‌కుమార్ జిల్లా మొదటి ర్యాంకు సాధించాడు. స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ విభాగంలో 80.3 మార్కులతో జగిత్యాల జిల్లా టాపర్‌గా నిలిచాడు. దీంతో ఆయన్ను బంధుమిత్రులు, స్నేహితులు అభినందిస్తున్నారు.