News September 23, 2024
KMM: తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు ప్యాకెట్

తిరుమల లడ్డూ కల్తీపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరోసారి అపవిత్రమైందంటూ ఖమ్మంలో జరిగిన ఘటన హాట్ టాపిక్‌గా మారింది. గొల్లగూడెం శివారులో కార్తికేయ టౌన్ షిప్‌కు చెందిన దొంతు పద్మావతి 19న తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వచ్చింది. ప్రసాదాన్ని వారి బంధువులకు, ఇరుగు పోరుగు వాళ్లకు పంచేందుకు చూడగా పొగాకు వంటి పదార్థం కనిపించిందని ఆరోపించారు. ఆ దృశ్యాలు ఇప్పుడు స్థానిక మధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
Similar News
News January 15, 2026
ఖమ్మం: మిస్సింగ్ యువకుడు సేఫ్

ఖమ్మంలోని ప్రకాష్ నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దిలీప్ కుమార్ అదృశ్యం సుఖాంతమైంది.‘వే2న్యూస్’లో వచ్చిన వార్తకు స్పందించిన నేషనల్ హైవే అథారిటీ అధికారులు, స్థానికులు దిలీప్ ఆచూకీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. త్రీ టౌన్ పోలీసులు బాధితుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కుమారుడిని సురక్షితంగా అప్పగించడంలో సహకరించిన వే2న్యూస్, అధికారులకు దిలీప్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
News January 15, 2026
ఖమ్మం: వైద్య సేవలకు ఊతం

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయి. కొత్తగా పది మంది ల్యాబ్ టెక్నీషియన్లను కేటాయించారు. నూతనంగా ఎంపికైన వీరు బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నరేందర్‌కు నివేదించారు. వీరి రాకతో ల్యాబ్ సేవలు మరింత వేగంగా అందుతాయని సూపరింటెండెంట్ హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీరడమే కాకుండా, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందుబాటులోకి రానున్నాయి.