News September 23, 2024

HYD: అక్టోబర్ 2 నుంచి ఆపరేషన్ సీవరెజ్

image

గ్రేటర్ HYD నగరంలో అక్టోబర్ 2 నుంచి జలమండలి ఆపరేషన్ సీవరెజ్ చేపట్టనుంది. 30 రోజుల పాటు 7050 కిలోమీటర్ల డ్రైనేజీ లైన్లను క్లీన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 225 ఎయిర్ టేక్ యంత్రాలను సైతం వినియోగించనున్నారు. జలమండలి పరిధిలోని అనేక చోట్ల చిన్నపాటి వర్షాలకే దాదాపు 3 లక్షల వరకు మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి.

Similar News

News November 17, 2024

HYD: గ్రూపు-3 పరీక్షలకు అదనపు బస్సులు

image

ఈ నెల 17, 18 తేదీల్లో జరగనున్న గ్రూప్‌-3 పరీక్షల కోసం అదనపు బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఈడీ వినోద్‌కుమార్‌ తెలిపారు. ఉదయం, సాయంత్రం 2 విడతలుగా జరగనున్న పరీక్షల సమయానికి అనుగుణంగా ఉదయం 10 గంటల్లోపు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకొనేలా బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. పరీక్షల అనంతరం సాయంత్రం తిరిగి గమ్యస్థానాలకు వెళ్లేందుకు వీలుగా బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు.

News November 16, 2024

HYD: సినీ నటుడు సాయికుమార్‌ వివరాల సేకరణ

image

జీహెచ్‌ఎంసీ పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే చురుగ్గా సాగుతోంది. ఇందులో భాగంగా ఎన్యూమరేటర్లు సర్వేలో వివరాలు సేకరిస్తున్నారు. శనివారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న సినీనటులు అలీ, సాయికుమార్‌ల నివాసాలకు వెళ్లి సర్వేకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మేనేజర్‌ శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు.

News November 16, 2024

సకుటుంబ సర్వేను పరిశీలించిన HYD కలెక్టర్

image

సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని HYD జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. శనివారం బేగంపేట్‌లోని మయూరి మార్గ్‌లో కొనసాగుతున్న సర్వేను కలెక్టర్ పరిశీలించారు. డిప్యూటీ కమిషనర్ సోమయ్య, ఎన్యుమరేటర్లతో మాట్లాడి ఆరా తీశారు. కుటుంబ సభ్యుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. అన్ని వివరాలు అందించి ఎన్యుమరేటర్లకు సహకరించాలని ప్రజలను కలెక్టర్ కోరారు.