News September 23, 2024
పోలీసులకు హరీశ్ రావు హెచ్చరిక

TG: కొందరు పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని హరీశ్ రావు అన్నారు. ‘ఏపీలో ఏమైందో పోలీసులు గుర్తుంచుకోవాలి. అలాంటి పరిణామాలు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదు. అధికారులు చట్టాలకు లోబడి పనిచేయాలి. BRS శ్రేణులపై అక్రమ కేసులు పెడితే సహించం’ అని హెచ్చరించారు. కాగా YCPకి సహకరించారని ముగ్గురు IPSలను AP ప్రభుత్వం ఇటీవల సస్పెండ్ చేసింది.
Similar News
News January 19, 2026
గంటా 45 నిమిషాల మీటింగ్ కోసం 6 గంటల ప్రయాణం.. ఏదో ఉంది?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ UAE అధ్యక్షుడు అల్ నహ్యాన్ భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం గంటా 45 నిమిషాల కోసం ఆయన ఆరు గంటలు ప్రయాణించడం గమనార్హం. ఇరాన్ కల్లోలం, సౌదీ-UAE మధ్య యెమెన్ చిచ్చు, గాజా శాంతి చర్చల వంటి ఇష్యూస్ నేపథ్యంలో ఫోన్లో కాకుండా నేరుగా చర్చించేంత బలమైన విషయమేదో ఉందని దౌత్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. భారత్‌ను బలమైన భాగస్వామిగా UAE నమ్ముతోంది.
News January 19, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు నోటీసులు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, BRS నేత హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉ.11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు రావాలని అందులో పేర్కొంది. హరీశ్ పాత్రపై ఓ ప్రైవేటు ఛానెల్ ఎండీ స్టేట్‌మెంట్ మేరకు ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన ఈ కేసులో BRS కీలక నేతకు నోటీసులు రావడం సంచలనంగా మారింది. అయితే ఆయన విచారణకు హాజరవుతారా లేదా? అనేది ఆసక్తిగా మారింది.
News January 19, 2026
గుండె పదిలంగా ఉండాలా? అయితే బెడ్ రూమ్ లైట్లు ఆపేయండి!

నిద్రపోయేటప్పుడు గదిలో వెలుతురు ఉంటే గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని JAMA Network Open తాజా స్టడీలో తేలింది. సుమారు 89,000 మంది గుండె పనితీరును ట్రాక్ చేశారు. లైట్లు వేసుకుని పడుకునే వారికి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ 47%, హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు 56% ఎక్కువగా ఉంటుందట. ఈ వెలుతురు బాడీలోని సర్కేడియన్ రిథమ్‌ను దెబ్బతీసి స్ట్రెస్ పెంచుతుందట. అందుకే హెల్తీగా ఉండాలంటే చీకట్లోనే నిద్రపోవాలి.


