News September 23, 2024

గుండె ఆరోగ్యంగా ఉందో లేదో ఇలా తెలుసుకోండి!

image

ఆగకుండా 45 నిమిషాల పాటు నడవగలిగితే మీ గుండె ఆరోగ్యంగా ఉన్నట్లేనని ముంబై లీలావతి హాస్పిటల్‌ కార్డియాలజిస్ట్ డా.రవీందర్ తెలిపారు. అయితే వయసు, లింగాన్ని బట్టి కొన్ని మార్పులుంటాయన్నారు. ‘కొందరు గంటలో 6KMS నడిస్తే, మరికొందరు అంతకంటే తక్కువగా నడుస్తారు. కానీ ఆగకుండా నడుస్తున్నారంటే వారి గుండె ఆరోగ్యంగా ఉన్నట్లే. అందుకే చెడు అలవాట్లను వదిలి, రోజూ నడవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది’ అని తెలిపారు.

Similar News

News September 23, 2024

మైనారిటీల పథకాలను రీ స్ట్రక్చర్ చేయాలి: CM

image

AP: ముస్లిం మైనారిటీలకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పథకాలు రీ స్ట్రక్చర్ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు, ఎన్నికల్లో ప్రకటించిన హామీలు బేరీజు వేసుకోవాలని సూచించారు. మైనారిటీ సంక్షేమంపై సచివాలయంలో మంత్రి ఫరూక్, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

News September 23, 2024

వాళ్లిద్దరూ లేకుండా భారత్‌లో టెస్టు మ్యాచ్ ఉండదు: అక్మల్

image

భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజాపై పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసలు కురిపించారు. వారిద్దరూ లేకుండా భారత్‌‌ స్వదేశంలో టెస్టు ఆడటాన్ని ఊహించలేమని పేర్కొన్నారు. ‘6 వికెట్లు, సెంచరీతో అశ్విన్ అద్భుత ప్రదర్శన చేశారు. జడ్డూ-అశ్విన్‌ది మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం. ఇక ఘోర ప్రమాదం తర్వాత పంత్ సైతం అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఆయనకు చికిత్స అందించిన వైద్యులకు హ్యాట్సాఫ్’ అని కొనియాడారు.

News September 23, 2024

కుటుంబపరంగా మేం కలిసే ఉన్నాం: శరద్ పవార్

image

అజిత్ ప‌వార్‌తో కుటుంబ‌ప‌రంగా క‌లిసే ఉన్నామ‌ని NCP SP చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ అన్నారు. బాబాయ్‌-అబ్బాయి మ‌రోసారి క‌లిసి ప‌నిచేయాల‌న్న డిమాండ్ల‌పై ఆయ‌న‌ స్పందించారు. కుటుంబ‌ప‌రంగా ఇద్ద‌రం క‌లిసే ఉన్నామ‌ని, రాజ‌కీయంగా ఆయ‌న మ‌రో పార్టీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నార‌ని శ‌ర‌ద్ ప‌వార్ పేర్కొన్నారు. బారామ‌తిలో సుప్రియ సూలేపై త‌న భార్య‌ను పోటీకి దింపి త‌ప్పు చేశాన‌ని అజిత్ ప‌వార్ గ‌తంలో ప‌శ్చాత్తాపం చెందారు.