News September 23, 2024

10 మంది MLAలకు హైకోర్టు నోటీసులు

image

TG: ఇటీవల పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ వేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Similar News

News September 23, 2024

అమెరికా పంపే డ్రోన్లతో ఉపయోగాలేంటి?

image

అమెరికా నుంచి భార‌త్ <<14173073>>స‌మ‌కూర్చుకోనున్న<<>> 31 MQ- 9B ప్రిడేటర్ డ్రోన్లు దేశ స‌రిహ‌ద్దు భ‌ద్ర‌త‌ను మ‌రింత ప‌టిష్ఠం చేయ‌నున్నాయి. చైనా, ఇండో-ప‌సిఫిక్ ప్రాంతాల్లో 16 గగనతల, 15 సముద్రతీర రక్షణ డ్రోన్లను మోహరించనున్నారు. ఈ డ్రోన్లు 35 గంట‌ల‌పాటు ఏక‌ధాటిగా గాల్లో ఉండ‌గ‌ల‌వు. 50,000 అడుగుల ఎత్తులో 442 km/h అత్యధిక వేగంతో ఎగుర‌గ‌ల‌వు. అంతేకాకుండా అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో 1,700 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలవు.

News September 23, 2024

పిల్లలకు లైంగిక విద్య అవసరం: సుప్రీం కోర్టు

image

పిల్లలకు లైంగిక విద్య అత్యంత ఆవశ్యకమని సుప్రీం కోర్టు తాజాగా అభిప్రాయపడింది. పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్‌ ఉండాలని పేర్కొంది. ‘లైంగిక విద్య పాశ్చాత్యుల విధానమని, మన వద్ద ప్రారంభిస్తే పిల్లలు చెడిపోతారని ఓ దుష్ప్రచారం ఉంది. ఓ అధ్యయనం ప్రకారం.. సమగ్ర సెక్స్ ఎడ్యుకేషన్ వారిలో అవగాహనను పెంచుతుంది. తద్వారా వారు పోర్న్‌కు, లైంగిక నేరాలకు అలవాటు పడకుండా ఆపే అవకాశం ఉంటుంది’ అని తెలిపింది.

News September 23, 2024

అదే జరిగితే 75% మంది UPI సేవల వినియోగాన్ని ఆపేస్తారు

image

UPI చెల్లింపులకు రుసుములు విధిస్తే మెజారిటీ యూజర్లు వాటి వినియోగాన్ని తగ్గించేస్తారని లోకల్‌ సర్కిల్స్ సర్వేలో తేలింది. లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తే 75 శాతం మంది UPI సేవల వాడకాన్ని వదిలేసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది డిజిటల్ చెల్లింపులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది. 38% యూజర్లు రోజులో సగం చెల్లింపులకు UPI వాడుతున్నారు. 10 మంది యూజర్లలో నలుగురు UPIకి ప్రాధాన్యమిస్తున్నారు.