News September 23, 2024

ముంబై నటి కేసులో నిందితులుగా ఐపీఎస్ అధికారుల పేర్లు

image

AP: ముంబై నటి జెత్వానీని వేధించిన కేసులో పోలీసులు ఐదుగురిని నిందితులుగా చేర్చారు. వీరిలో ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. ఏ1 కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో ఏ2గా పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏ3గా కాంతిరాణా, ఏ4గా అప్పటి వెస్ట్ జోన్ ఏసీపీ హనుమంతురావు పేర్లను నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటికే వీరిని ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News September 23, 2024

‘దేవర’ టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి

image

తెలంగాణలో దేవర సినిమా టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. SEP 27న రాష్ట్రంలోని 29 థియేటర్లలో రూ.100 పెంచి అర్ధరాత్రి ఒంటిగంటకు అదనపు షో వేసుకునేందుకు ఓకే చెప్పింది. అన్ని థియేటర్లలో తెల్లవారుజామున 4 గంటలకు రూ.100 పెంచి రోజుకు 6 షోలు వేసుకోవచ్చని తెలిపింది. ఇక సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.25, మల్టీప్లెక్సుల్లో రూ.50 హైక్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది.

News September 23, 2024

ఆస్కార్‌-2025: ‘హనుమాన్’ జస్ట్ మిస్!

image

భారత్ నుంచి ఆస్కార్-2025కి ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ‘లాపతా లేడీస్’ను నామినేట్ చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఈ జాబితాలో 29 సినిమాలను FFI పరిశీలించింది. వీటిలో తెలుగు సినిమాలు హనుమాన్, కల్కి, మంగళవారం ఉన్నాయి. అత్యధికంగా హిందీ నుంచి 12, తమిళం నుంచి 6, మలయాళం నుంచి 4, మరాఠీ నుంచి 3, ఒడియా నుంచి ఒకటి ఉన్నాయి. అంతిమంగా ‘లాపతా లేడీస్’కే ఫెడరేషన్ ఓటేసింది.

News September 23, 2024

లౌకికవాదం భారత్‌కు అవసరం లేదు: తమిళనాడు గవర్నర్

image

లౌకికవాదం పేరుతో భారత ప్రజలకు ‘మోసం’ జరిగిందని త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ RN ర‌వి చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. లౌకిక‌వాదం భారతదేశంలో అవసరం లేదన్నారు. ‘ఈ దేశ ప్రజలపై ఎన్నో మోసాలు జరిగాయి. లౌకికవాదాన్ని తప్పుగా అభివర్ణించడం వాటిలో ఒకటి. లౌకికవాదం అనేది యూరోపియన్ భావన. భారతీయ భావన కాదు. ఐరోపాలో చర్చికి, రాజుకు మధ్య ఘర్షణ వల్ల సెక్యులరిజం పుట్టింది’ అని ఆయన పేర్కొన్నారు.