News September 23, 2024

పిల్లలిద్దరూ ప్రయోజకులైతే.. ఆ తల్లికింకేం కావాలి!

image

పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. వారికి నచ్చిన చదువు, నైపుణ్యం ఉన్న క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు వెనకాడరు. అయితే, కొందరు మాత్రమే ప్రయోజకులై తల్లిదండ్రులకు, ఊరికి, దేశానికి పేరుతెస్తుంటారు. దేశానికి ఇద్దరు గ్రాండ్ మాస్టర్లను అందించిన ప్రజ్ఞానంద, వైశాలీల తల్లి నాగలక్ష్మి ఈరోజు ఎంతో గర్వపడి ఉంటారు. కూతురు, కుమారుడు ఇద్దరూ నేడు ప్రపంచ ఛాంపియన్లయ్యారు.

Similar News

News September 23, 2024

రికార్డు సృష్టించిన బాలీవుడ్ మూవీ

image

శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన ‘స్త్రీ2’ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మూవీ ఇప్పటివరకు భారత్‌లో రూ.604.22 కోట్లు(నెట్) రాబట్టగా రూ.713 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్లు తెలిపింది.

News September 23, 2024

ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం

image

TG: రాష్ట్రంలో రేషన్, హెల్త్ ప్రొఫైల్‌తో పాటు సంక్షేమ పథకాలన్నీ ఒకే ఫ్యామిలీ కార్డుగా తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతి నియోజకవర్గంలో ఒక అర్బన్, రూరల్ ప్రాంతాన్ని ఎంచుకొని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీటి మానిటరింగ్‌కు జిల్లాలవారీగా వ్యవస్థ ఉండాలని సూచించారు. దీని కోసం పలు రాష్ట్రాల్లో ఉన్న విధానాలను అధ్యయనం చేయాలన్నారు.

News September 23, 2024

వరద పరిహారంపై ప్రభుత్వం ఉత్తర్వులు

image

AP: వరద బాధితులకు పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో 179 సచివాలయాల పరిధిలో నీట మునిగిన ఇళ్లకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ జీవో విడుదల చేసింది. పంట నష్టంపైనా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఎల్లుండి నుంచి పరిహారం బాధితులకు అందజేయనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.