News September 23, 2024

ప్రకాశం జిల్లాలో మైనింగ్ అధికారుల బదిలీలు

image

ప్రకాశం జిల్లాలోని ప్రాంతీయ మైనింగ్ విజిలెన్స్ అధికారుల బృందం సోమవారం ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. వారి స్థానంలో ప్రభుత్వం నూతనంగా AD సురేశ్ కుమార్ రెడ్డి, రాయల్టీ ఇన్స్పెక్టర్ రాజులను నియమించారు. వీరు మంగళవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న అధికారిని తిరుపతికి బదిలీ చేశారు.

Similar News

News November 9, 2025

ఒంగోలు: మీరు వెళ్లే బస్సు బాగుందా? లేదా?

image

వరుస ప్రమాదాల నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. చాలా వాటిపై కేసులు నమోదు చేశారు. స్కూళ్లు, కాలేజీ బస్సుల పనితీరుపైనా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దీంతో సంతనూతలపాడు పోలీస్‌లు శనివారం ప్రైవేట్ స్కూల్ బస్సులను చెక్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ కిట్, అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా? లేదా? అని తీశారు. మీరు వెళ్లే స్కూల్/కాలేజీ బస్సులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News November 9, 2025

ప్రకాశం జిల్లా ప్రజలకు గమనిక

image

సీఎం చంద్రబాబు ఈనెల 11న ప్రకాశం జిల్లాకు రానున్నారు. ఈనేపథ్యంలో ఈనెల 10న సోమవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ‘మీ కోసం’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. సమస్యలపై అర్జీలు ఇవ్వడానికి దూర ప్రాంతాల నుంచి ఎవరూ ఒంగోలుకు రావద్దని సూచించారు.

News November 9, 2025

‘మీ కోసం’ రద్దు: కలెక్టర్

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11న జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 10న సోమవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ‘మీ కోసం’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు శనివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి ఎవరూ అర్జీలు అందించేందుకు జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు.