News September 23, 2024

పుణే విమానాశ్ర‌యం పేరు మార్పు! క్యాబినెట్ ఆమోదం

image

పుణే విమానాశ్రయం పేరు మార్పు ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. ‘జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ పుణే అంత‌ర్జాతీయ‌ విమానాశ్రయం’గా పేరు మార్పున‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. త‌దుప‌రి అనుమ‌తుల కోసం కేంద్రానికి ప్ర‌తిపాద‌న‌లు పంపింది. విమానాశ్రయానికి పేరు మార్చే దిశగా తొలి అడుగు వేశామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ Xలో తెలిపారు.

Similar News

News January 11, 2026

శుభ సమయం (11-1-2026) ఆదివారం

image

➤ తిథి: బహుళ అష్టమి మ.12.14 వరకు ➤ నక్షత్రం: చిత్త రా.8.14 వరకు ➤ శుభ సమయాలు: ఉ.7.29-10.15 వరకు, ఉ.11.10-12.50 వరకు తిరిగి మ.1.55-మ.4.07 వరకు ➤ రాహుకాలం: సా.4.30-6.00 వరకు ➤ యమగండం: మ.12.00-1.30 వరకు ➤ దుర్ముహూర్తం: సా.4.08-4.52 వరకు ➤ వర్జ్యం: రా.2.20-4.05 వరకు ➤ అమృత ఘడియలు: మ.1.21-3.04 వరకు

ఫ్యూచర్ సిటీ భూములు.. రైతులకు ఇవ్వాలని డిమాండ్!

image

గత ప్రభుత్వం సేకరించిన 19,333 ఎకరాల ఫార్మా సిటీ భూములను ప్రస్తుత ప్రభుత్వం ‘ఫ్యూచర్ సిటీ’గా మార్చడం న్యాయపరమైన వివాదాలకు దారితీస్తోంది. ఒక నిర్దిష్ట ‘ప్రజా ప్రయోజనం’ కోసం సేకరించిన భూమిని ఇతర వాణిజ్య అవసరాలకు మళ్లించడంపై 2013 భూసేకరణ చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిర్దేశిత ప్రాజెక్టును రద్దు చేసినప్పుడు, ఆ భూములను తిరిగి రైతులకు అప్పగించాలనే డిమాండ్ పెరుగుతోంది.