News September 23, 2024

నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై దుమారం

image

ఒత్తిడిని ఎదుర్కోవ‌డానికి అంత‌ర్గ‌త బ‌లం ఉండాలని, అది దైవత్వం నుంచి వస్తుంది కాబట్టి తల్లిదండ్రులు ఆ దిశగా పిల్లల్ని పెంచాలంటూ కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. కేరళకు చెందిన యువ CA మృతిపై ఆమె ఈ విధంగా స్పందించారు. నిర్మల వ్యాఖ్యలను కేరళ CPM, కాంగ్రెస్ తీవ్రంగా ఖండించాయి. నిర్మల IT ఉద్యోగులను దోపిడీ చేసే కార్పొరేట్ డ్రాక్యులాలకు రక్షకురాలిగా మారారని విమర్శించాయి.

Similar News

News September 24, 2024

నియోజకవర్గాల్లో ప్రతి నెలా జాబ్ మేళా: నారా లోకేశ్

image

AP: రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహణకు క్యాలెండర్ రూపొందించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖ అధికారులతో ఆయన రివ్యూ నిర్వహించారు. రాష్ట్రంలో యూనివర్సిటీలలో చదివే ప్రతి విద్యార్థికీ ఉద్యోగం రావాలన్నారు. దానికి అనుగుణంగా మార్పులు చేయాలని సూచించారు. ర్యాంకింగ్స్ మెరుగుదలకు నిపుణుల సలహాలు తీసుకోవాలని చెప్పారు.

News September 24, 2024

దేవరలో జాన్వీ పాత్ర ఎంటర్ అయ్యేది అప్పుడేనా?

image

‘దేవర’లో హీరోయిన్ ఎంట్రీ గురించి ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. తంగం అనే పాత్రలో జాన్వీ కపూర్ కనిపిస్తారు. సినిమా రన్‌టైమ్ సుమారు 3 గంటలున్నా ఆమె పాత్ర వచ్చేది ఇంటర్వెల్ తర్వాతేనని సమాచారం. కథ అంతా ప్రధానంగా దేవర పాత్రను ఎస్టాబ్లిష్ చేయడం చుట్టూనే తిరుగుతుందని, సగం సినిమా అయ్యాకే హీరోయిన్ ట్రాక్ మొదలవుతుందని టాక్. ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో చూడాలి మరి.

News September 24, 2024

ఇంటర్నెట్ స్పీడ్‌గా రావాలంటే..

image

1.ఫోన్ రీస్టార్ట్ చేయండి.
2.సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఉండేట్లు చూసుకోండి.
3.సిగ్నల్ వీక్ ఉన్న దగ్గర ఫోన్ వాడొద్దు.
4.cache, cookies క్లియర్ చేయండి.
>> ఇక వైఫై వాడేవాళ్లు రౌటర్‌ను అప్పుడప్పుడూ రీస్టార్ట్ చేస్తూ ఉండాలి. అలాగే నెట్ సిగ్నల్ వీక్ ఉంటే రౌటర్ ప్లేస్‌ను మార్చడం బెటర్. ఇక వైఫై కంటే ఈథర్‌నెట్ కనెక్షన్ వేగం బాగుంటుంది.