News September 23, 2024

లౌకికవాదం భారత్‌కు అవసరం లేదు: తమిళనాడు గవర్నర్

image

లౌకికవాదం పేరుతో భారత ప్రజలకు ‘మోసం’ జరిగిందని త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ RN ర‌వి చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. లౌకిక‌వాదం భారతదేశంలో అవసరం లేదన్నారు. ‘ఈ దేశ ప్రజలపై ఎన్నో మోసాలు జరిగాయి. లౌకికవాదాన్ని తప్పుగా అభివర్ణించడం వాటిలో ఒకటి. లౌకికవాదం అనేది యూరోపియన్ భావన. భారతీయ భావన కాదు. ఐరోపాలో చర్చికి, రాజుకు మధ్య ఘర్షణ వల్ల సెక్యులరిజం పుట్టింది’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 24, 2024

రివ్యూవర్లకు హీరో సూర్య చురకలు

image

కార్తీ తాజా సినిమా ‘సత్యం సుందరం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన సోదరుడు హీరో సూర్య రివ్యూవర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాను సినిమాలా చూసి ఎంజాయ్ చేయాలని కోరారు. ‘సినిమాను సెలబ్రేట్ చేసుకుందాం. ఇన్వాల్వ్ అయి చూస్తేనే కథ, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్, ఎమోషన్స్, హాస్యం ఇలా ప్రతిదాన్నీ ఆస్వాదించగలం. తప్పులు వెతికేందుకో లేక బాక్సాఫీస్ కలెక్షన్ల దృష్టితో చూస్తే సినిమాను ఎంజాయ్ చేయలేం’ అని పేర్కొన్నారు.

News September 24, 2024

భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు

image

AP: వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. లడ్డూ వివాదంపై తిరుమలలోని అఖిలాండం వద్ద ప్రమాణం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దని తిరుమలకు చేరుకునే ముందు ఆయనకు పోలీసులు నోటీసులిచ్చారు. అయినప్పటికీ విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని, భక్తుల మనోభావాలు దెబ్బతీశారని పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు.

News September 24, 2024

నియోజకవర్గాల్లో ప్రతి నెలా జాబ్ మేళా: నారా లోకేశ్

image

AP: రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహణకు క్యాలెండర్ రూపొందించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖ అధికారులతో ఆయన రివ్యూ నిర్వహించారు. రాష్ట్రంలో యూనివర్సిటీలలో చదివే ప్రతి విద్యార్థికీ ఉద్యోగం రావాలన్నారు. దానికి అనుగుణంగా మార్పులు చేయాలని సూచించారు. ర్యాంకింగ్స్ మెరుగుదలకు నిపుణుల సలహాలు తీసుకోవాలని చెప్పారు.