News September 23, 2024

‘దేవర’ టికెట్లు వచ్చేశాయ్!

image

ఏపీ, తెలంగాణలో దేవర ఫీవర్ షురూ అయింది. పలు థియేటర్లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్‌లో నిమిషాల వ్యవధిలోనే టికెట్లు సేల్ అయిపోయాయి. రేపు చాలా థియేటర్లలో బుకింగ్ ఛాన్స్ కల్పించే అవకాశం ఉంది. ఇక రిలీజ్ డేట్ అయిన సెప్టెంబర్ 27న 29 థియేటర్లలో అర్ధరాత్రి ఒంటిగంట షోకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

Similar News

News January 10, 2025

కరెంటు ఛార్జీలపై శుభవార్త

image

AP: 2025-26 ఏడాదికి ప్రజలపై కరెంటు ఛార్జీల భారం ఉండదని విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ఠాగూర్ రామ్ శుభవార్త చెప్పారు. రూ.14,683 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సహా రాయితీలన్నీ కొనసాగుతాయని తెలిపారు. ఇటీవల నిర్వహించిన బహిరంగ విచారణలో కరెంటు ఛార్జీలు పెంచొద్దని ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేశాయని పేర్కొన్నారు.

News January 10, 2025

జాగ్రత్త బాసూ.. సంక్రాంతికి ఊరెళ్తున్నావా?

image

సంక్రాంతికి ఊరెళ్లేవారు పలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు కోరుతున్నారు. ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకూడదు. బీరువా తాళాలు, నగదు, నగలు బ్యాంకులో భద్రపరుచుకోవాలి. ఇంటికి తాళం వేసినట్లు కనిపించకుండా కర్టెన్ తొడగాలి. CC కెమెరాలు బిగించుకోవాలి. ఊరెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవద్దు. ఇంటి ముందు తెలిసినవారితో చెత్త శుభ్రం చేయించుకోవాలి. కొత్త వ్యక్తులు కనిపిస్తే 100కు సమాచారం ఇవ్వాలి.

News January 10, 2025

విరాట్, రోహిత్‌ను గంభీర్ తప్పించలేరు: మనోజ్ తివారీ

image

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను భారత జట్టు నుంచి తప్పించే సాహసం కోచ్ గంభీర్ చేయరని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. ఆఖరి టెస్టుకు రోహిత్ స్వచ్ఛందంగా పక్కన కూర్చుని ఉండి ఉంటారని తెలిపారు. ‘గంభీరే రోహిత్‌ను పక్కకు పెట్టారన్న వార్తలు కరెక్ట్ కాదనుకుంటున్నా. అయితే, జట్టు కోసమే చేసినా ఓ కెప్టెన్‌గా రోహిత్ అలా తప్పుకుని ఉండాల్సింది కాదు’ అని పేర్కొన్నారు.